Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Manik Bhandar Witchcraft | మాణిక్ బండార్‌లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు.. సీపీకి ఫిర్యాదు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Manik Bhandar Witchcraft | మాణిక్ బండార్‌లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు.. సీపీకి ఫిర్యాదు!

నిజామాబాద్తాజా వార్తలు

Manik Bhandar Witchcraft | మాణిక్ బండార్‌లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు.. సీపీకి ఫిర్యాదు!

నిందితుడితోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారందరినీ కఠినంగా శిక్షించాలని, తమ గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని మాణిక్ బండార్ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 8, 2026 11:25 సా.
Naresh chandan
5 గంటలు ago
Share
Manik Bhandar Witchcraft
Manik Bhandar Witchcraft

అక్షరటుడే, ఇందూరు: Manik Bhandar Witchcraft | నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మాణిక్ బండార్ గ్రామంలో క్షుద్ర పూజల ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా అర్ధరాత్రి వేళల్లో కొందరు మంత్ర తంత్రాలు ప్రయోగిస్తూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Contents
  • Manik Bhandar Witchcraft | అర్ధరాత్రి బలులు:
    • Manik Bhandar Witchcraft | అసభ్య ప్రవర్తన:
      • సీపీ హామీ:

ఈ మూఢనమ్మకాలతో పాటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలతో గ్రామస్థులు పెద్ద ఎత్తున నిజామాబాద్​ పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి తరలివచ్చారు.

Manik Bhandar Witchcraft | అర్ధరాత్రి బలులు:

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి, గురు, ఆదివారాల్లో అర్ధరాత్రి పూట కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంతు బలులతోపాటు వింత అరుపులు వినిపించడంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

గతంలోనూ ఇలాంటి ఘటనలపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులపైకి నిందితులు రాళ్ళు రువ్విన సందర్భాలు సైతం ఉన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Manik Bhandar Witchcraft | అసభ్య ప్రవర్తన:

క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులు గ్రామంలోని మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సెవెంత్ క్లాస్ చదువుతున్న చిన్న పిల్లలకు సైతం అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారని ఒక మహిళ మీడియా ఎదుట వాపోయారు. వారి వల్ల మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

సీపీ హామీ:

గ్రామస్థుల సమస్యపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో నిఘాను పెంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఇది కూడా చదవండి: Temple Pradakshina Secrets | గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా.. అయితే ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే!

ఇది కూడా చదవండి: Masik Krishna Janmashtami | మాసిక కృష్ణ జన్మాష్టమి.. ఈ చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో అన్నీ శుభాలే!

Strengthen Bones Diet | ఎముకల అరుగుదలకు బ్రేక్.. మహిళల ఆరోగ్యానికి ఇవే కరెక్ట్ డైట్!
Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
TAGGED:Black Magic complaintCP Sai ChaitanyaManik BhandarManik Bhandar residentsManik Bhandar WitchcraftNizamabad NewsTelangana local newsWitchcraft incidentwomen harassment case
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Masik Krishna Janmashtami Masik Krishna Janmashtami | మాసిక కృష్ణ జన్మాష్టమి.. ఈ చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో అన్నీ శుభాలే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?