అక్షరటుడే, వెబ్డెస్క్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇటీవల మావోస్టు అగ్రనేతలు వరుసగా సరెండర్ అయిన విషయం తెలిసిందే.
Maoists Surrender Odisha | ఒడిశాలోని కలహాండి జిల్లాలో..
ఒడిశాలోని కలహాండి జిల్లాలో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. ఆ రాష్ట్ర డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో డివిజనల్ కమిటీ సభ్యుడు నకుల్ సహా 11 మంది సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు.
Maoists Surrender Odisha | ఆయుధాల అప్పగింత
లొంగిపోయిన మావోయిస్టులు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక AK-47 రైఫిల్, ఒక ఇన్‌సాస్ (INSAS), నాలుగు ఎస్ఎల్ఆర్ (SLR) రైఫిళ్లు ఉన్నాయి. అలాగే మందుగుండు సామాగ్రి ఉంది. మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా స్టేట్ కమిటీలో డీసీఎంగా పనిచేస్తున్నారు. కాగా.. ఈయనపై రూ. 22 లక్షల రివార్డు ఉంది. వీరి టీం బసధారా–ఘుమ్షార్–నాగాబలి డివిజన్ పరిధిలో చురుకుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారిగా తెలిపారు.
ଡିଜିପିଙ୍କ ନିକଟରେ ୧୧ ମାଓବାଦୀଙ୍କ ଆତ୍ମସମର୍ପଣ#OdiNews #MaoistsSurrenderhttps://t.co/7XgbeyGrqG
— ZEE Odisha News (@ZeeOdisha) March 15, 2026
ఇది కూడా చదవండి..: Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్

