అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists Surrender Telangana | మావోయిస్టుల లొంగుబాట కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట పెద్ద సంఖ్యలో నక్సల్స్ సరెండర్ అయ్యారు. ఇందులో కీలక నేత గణపతి అలియాస్, ముప్పాళ్ల లక్ష్మణరావు సైతం ఉన్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.
మావోయిస్ట్ లొంగుబాట్ల కోసం తెలంగాణ పోలీసులు (Telangana Police) తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎస్ఐబీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మావోయిస్టులను సరెండర్ అయ్యేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కీలక నేతలు మల్ల రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి సహా పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. అగ్రనేతల లొంగుబాటు, ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ ఉద్యమం ఇప్పటికే బలహీనం అయింది. ఈ క్రమంలో తాజాగా 130 మంది ఆయుధాలు వీడారు. మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీగా సుదీర్ఘ కాలం పని చేసిన గణపతి కొంతకాలంగా అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లు తెలిసింది.
Maoists Surrender Telangana | ఆయుధాలు స్వాధీనం
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 70కిపైగా తుపాకులు, మందుగుండు సామగ్రి పోలీసులకు అప్పగించారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు లొంగిపోనున్నారు. దేవ్‌జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ప్రభుత్వ పునరావాస పథకాలతో వీరు లొంగిపోతున్నారు.
Maoists Surrender Telangana | సమీపిస్తున్న గడువు
దేశంలో ఈ నెల 31లోపు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఆ గడువు సమీపిస్తోంది. దీంతో కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ బలహీనం అయింది. కీలక నేతలు లొంగిపోవడం, ఎన్కౌంటర్లో హతం అవడంతో కేడర్ సైతం లొంగుబాట పట్టారు. కొంతమంది అడవుల్లో ఉండగా.. వారి కోసం కేంద్ర బలగాలు నిత్యం సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేస్తున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోలు ఆయుధాలు వీడటానికి సిద్ధం అవుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిశారు.మావోయిస్టుల గురించి ఆయన చర్చించారు. ఈ క్రమంలో తాజాగా 130 మంది లొంగిపోవడం గమనార్హం. గణపతి లొంగుబాటు నేపథ్యంలో అమిత్‌షాను సీఎం కలిసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జిల్లా ఎస్పీలు, డీజీపీ మాత్రమే మావోల లొంగుబాటు గురించి మీడియాకు వెల్లడించారు. కానీ నేడు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు. దీంతో మావోయిస్ట్ శకం ముగిసినట్లు ఆయన ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Telangana Temple Attacks | ఆలయాలపై దాడులు ఆందోళనకరం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

