Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maoists surrender Telangana | మావోయిస్ట్​ రహితంగా తెలంగాణ : డీజీపీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Maoists surrender Telangana | మావోయిస్ట్​ రహితంగా తెలంగాణ : డీజీపీ

తెలంగాణతాజా వార్తలు

Maoists surrender Telangana | మావోయిస్ట్​ రహితంగా తెలంగాణ : డీజీపీ

తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ శివధర్​రెడ్డి అన్నారు. ఆయన ఎదుట శుక్రవారం 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 4:03 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Maoists surrender Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists surrender Telangana | తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. ఆయన ఎదుట శుక్రవారం 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పూర్తిస్థాయిలో PLGA కనుమరుగైందని డీజీపీ తెలిపారు.

లొంగిపోయిన వారిలో పీఎల్​జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోడి కేశలు అలియాస్ కేశతో సహా 42 మంది మావోయిస్టులు ఉన్నారు. 36 ఆయుధాలతో వారు సరెండర్​ అయ్యారు. ఇందులో 5 AK–47, 4 SLR, 3 INSAS రైఫిల్స్, 6 BGL గన్స్, 1 పిస్టల్, 2 రివాల్వర్లు ఉన్నాయి. వారు 800 గ్రాముల బంగారాన్ని సైతం పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారి జాబితాలో పీఎల్​జీఏ బెటాలియన్​కు చెందిన ఒక శిక్షణ పొందిన వైద్యుడు కూడా ఉన్నారు.

Maoists surrender Telangana | గర్వంగా ప్రకటిస్తున్నా..

డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ… ఈ భారీ లొంగుబాటుతో రాష్ట్రంలో పీఎల్‌జీఏ బెటాలియన్ (PLGA Battalion) పూర్తిస్థాయిలో కనుమరుగైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్టు కేడర్ ఎవరూ లేరని తెలిపారు. దీంతో రాష్ట్రం మావోయిస్టు రహితంగా అవతరించిందని గర్వంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం లొంగిపోయిన సోడి కేశాలు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దు వెంబడి పనిచేస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్‌ఏ) బెటాలియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా కీలక పాత్ర పోషించాడు. కర్రెగుట్ట (Karregutta)ల్లో మావోయిస్టు కేడర్‌లకు నాయకత్వం వహించాడు. బర్స దేవా లొంగిపోయిన తర్వాత బెటాలియన్ బాధ్యతలు స్వీకరించాడు.

ఇది కూడా చదవండి..: CV Anand DGP | కొత్త డీజీపీగా సీవీ ఆనంద్!

Kabandha Hasthalu | కబంధ హస్తాలు అనే పదం ఎక్కడిది.. దీని వెనుక అసలు ఏమిటి?
Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
TAGGED:DGP Shivadhar ReddyKarreguttaMaoists surrender TelanganaPLGA BattalionTelangana-Chhattisgarh
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Artisan Workers Demand | Artisan Workers Demand | సర్వీస్ రూల్స్​తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి.. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్
Next Article Indian Stock Market Surge Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?