అక్షరటుడే, న్యూఢిల్లీ: Mar 06 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ స్వల్ప నష్టాలతో ముగియగా.. యూరోపియన్ యూనియన్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) అర శాతానికిపైగా నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Mar 06 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో ఎస్ అండ్ పీ 0.56 శాతం, నాస్‌డాక్ 0.25 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.17 శాతం లాభంతో ఉంది.
Mar 06 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 1.64 శాతం శాతం, సీఏసీ 1.52 శాతం, ఎఫ్టీఎస్ఈ 1.48 నష్టపోయాయి.
Mar 06 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.93 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.27 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.13 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.02 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.42 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.38 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.59 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,752 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
డీఐఐలు నికరంగా రూ. 5,153 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.95 నుంచి 1.01 కు పెరిగింది.
విక్స్ 15.53 శాతం తగ్గి 17.86 వద్ద ఉంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 56 పైసలు బలపడి 91.60 వద్ద ఉంది.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84.25 డాలర్లకు చేరింది.

