Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..

బిజినెస్​తాజా వార్తలు

MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కొంత తగ్గగా, వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

Naresh chandan
Last updated: మార్చి 6, 2026 8:48 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
MARCH 06 Gold Silver Prices | 
MARCH 06 Gold Silver Prices | 

అక్షరటుడే, హైదరాబాద్​: MARCH 06 Gold Silver Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చు త‌గ్గుల‌కి గుర‌వుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అమెరికన్ డాలర్ బలహీనత లేదా బలపడటం, అలాగే మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు ఈ విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Contents
  • MARCH 06 Gold Silver Prices | ఇతర నగరాల్లో..
    • MARCH 06 Gold Silver Prices | వెండి విషయానికి వస్తే

ఈ ప్రభావంతోనే భారత మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు తరచూ మారుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో Gold Rates స్వల్ప తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ను తీసుకుంటే, ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,62,870గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,290గా నమోదైంది.

MARCH 06 Gold Silver Prices | ఇతర నగరాల్లో..

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

  • చెన్నైలో Chennai 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,64,940గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,190గా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,62,870గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,49,290గా ఉంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,63,020గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,49,440గా ఉంది.
  • కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,870గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,290గా కొనసాగుతోంది.

MARCH 06 Gold Silver Prices | వెండి విషయానికి వస్తే

ఇక వెండి ధర silver విషయానికి వస్తే, దేశీయ మార్కెట్‌లో వెండి ధర కూడా మార్పులు చూపుతోంది. ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.294.90గా ఉంది. అంటే 10 గ్రాముల వెండి ధర రూ.2,949గా ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరల మార్పుల ప్రభావంతో భారత మార్కెట్‌లో కూడా ధరలు తరచూ మారుతున్నాయి.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపినప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ఉన్నప్పుడు బంగారం ధరలు పెరగడం సాధారణం.

అయితే కొన్ని సందర్భాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగితే ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ ప్రస్తుతం కొంత స్థిరత్వం కనిపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా వచ్చే రోజుల్లో ధరలు మళ్లీ మారే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.

Fortune Atta | ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ పిండి ఉత్పత్తుల శ్రేణి విస్తరణ.. ‘ఫార్చ్యూన్ మల్టీగ్రైన్ అట్టా’ విడుదల
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు
Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
TAGGED:bullion market IndiaGold Price UpdateGold Rate Today IndiaGold Silver PricesHyderabad gold rateIndia Commodity PricesMARCH 06 Gold Silver PricesSilver Market NewsSilver price today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
Next Article Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?