Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!

బిజినెస్​తాజా వార్తలు

March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!

గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలకు చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు వరుసగా పడిపోతుండగా, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.ఈ వార్తతో ప‌సిడి ప్రియుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Naresh chandan
Last updated: మార్చి 7, 2026 8:04 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!

అక్షరటుడే, హైదరాబాద్: March 07 Gold Silver Rates | దేశంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు Gold Rates ఇప్పుడు రివర్స్ గేర్‌లో నడుస్తున్నాయి. గత వారం నుంచి వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు కూడా దిగివచ్చాయి. ఈ వారం ప్రారంభంలోనే సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిలను తాకిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుదల దిశగా సాగుతున్నాయి.

Contents
  • March 07 Gold Silver Rates | ప్ర‌ధాన న‌గ‌రాల‌లో..
    • March 07 Gold Silver Rates | వెండి పరిస్థితి..

అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, డాలర్ విలువల్లో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల ప్రవర్తన వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.16,112గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,769లకు చేరింది. దీంతో పది గ్రాముల బంగారం ధరలు కూడా కొంత మేర తగ్గాయి. ఇటీవల వరుసగా పెరిగిన ధరలతో కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేసిన వినియోగదారులకు ఈ తగ్గుదల కొంత ఊరట కలిగిస్తోంది.

March 07 Gold Silver Rates | ప్ర‌ధాన న‌గ‌రాల‌లో..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,63,190 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,590గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.1,61,120 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,690గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,270 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,840గా ఉంది.

అదేవిధంగా కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ Hyderabad నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,61,120గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,690గా కొనసాగుతోంది. అలాగే కేరళ, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి.

March 07 Gold Silver Rates | వెండి పరిస్థితి..

ఇక వెండి ధర విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం భారత్‌లో గ్రాము వెండి ధర రూ.289.90గా ఉంది. అంటే పది గ్రాముల వెండి ధర Silver Prices సుమారు రూ.2,899గా ఉంది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే సుమారు రూ.100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి.

దీంతో బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా గ్లోబల్ మార్కెట్ పరిస్థితులను బట్టి పసిడి ధరల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం!
Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
Godrej | వేసవి కోసం సరికొత్త స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించిన గోద్రెజ్.. 40 శాతం వృద్ధి లక్ష్యం..
Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
TAGGED:22k gold rate india24k gold rate indiaGold price Indiagold price march 2026gold silver rates todayindia gold marketMarch 07 Gold Silver Ratesprecious metals priceSilver price today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 07 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్యం దూరం.. ఆ రాశుల వారికి ఇక సంపూర్ణ ఆరోగ్య యోగం! March 07 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్యం దూరం.. ఆ రాశుల వారికి ఇక సంపూర్ణ ఆరోగ్య యోగం!
Next Article Banking Trust Banking Trust | భారతీయ బ్యాంకింగ్ రంగంలో మారుతున్న విశ్వసనీయత ప్రమాణాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?