అక్షరటుడే, హైదరాబాద్: March 11 Gold Prices | కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు Silver Prices మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ మార్పిడి విలువల ప్రభావంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
ముఖ్యంగా ఒక్క నిన్న ఒక్క రోజులోనే బంగారం ధరలు రూ.700కుపైగా పెరిగాయి. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగి ఏకంగా రూ.10 వేల వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలలో బంగారం, వెండి కొనుగోలు తప్పనిసరి కావడంతో ధరలు పెరగడం సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది.
March 11 Gold Prices | హెచ్చు తగ్గులు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయంగా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ప్రపంచ మార్కెట్లలో పరిస్థితులు మారినప్పుడల్లా బంగారం, వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మార్చి 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు Gold Prices ఇలా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,62,390 ; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,48,860
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,62,390 ; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,48,860
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,62,540 కాగా ; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,49,010
- ముంబైలో Mumbai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,62,390 : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,48,860
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,64,190 గా ట్రేడ్ కాగా ; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,50,510
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,62,390 ; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,48,860
March 11 Gold Prices | వెండి..
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర సుమారు రూ.3,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇతర ప్రధాన నగరాల్లో వెండి ధర కిలోకు సుమారు రూ.2,90,100గా నమోదైంది. ధరలు ఇలా పెరగడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కొంత ఆలోచనలో పడుతున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

