అక్షరటుడే, హైదరాబాద్: March 13 Gold Prices | దేశంలో గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు Silver Prices ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు పెట్టుబడిదారుల మారుతున్న ధోరణుల కారణంగా పసిడి ధరలు వరుసగా రెండో రోజు కూడా పడిపోయాయి. మార్చి 13న దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుదల దిశగా కొనసాగుతున్నాయి.
March 13 Gold Prices | దేశీయ మార్కెట్లో..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర సుమారు రూ.1,62,210 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో వెండి ధర కూడా కొంత మేర తగ్గి కిలోకు సుమారు రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది. గతంలో వరుసగా పెరిగిన ధరలతో కొనుగోలు చేయాలని భావించిన వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజా తగ్గుదలతో కొనుగోలు దారులకు కొంత ఊరట లభించినట్టైంది.
March 13 Gold Prices | నగరాల వారీగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు Gold Rates దాదాపు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,690 వద్ద ఉంది.
విజయవాడలో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,62,210 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,690గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,360 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,840గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,62,210 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,690 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో మాత్రం ఇతర నగరాల కంటే ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,300 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,690గా ఉంది.
ఇక బెంగళూరు, కోల్‌కతా, కేరళ వంటి ప్రాంతాల్లో కూడా హైదరాబాద్‌తో Hyderabad సమానంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,62,210 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.
March 13 Gold Prices | వెండి కూడా..
వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.2,89,900గా ఉంది. అయితే ఇతర నగరాల్లో వెండి ధర కొంచెం తక్కువగా ఉండి కిలోకు సుమారు రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారం ధరలు పెరగడం సహజం.
ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో ధరలు పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగి, గల్ఫ్ దేశాలపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితి ఉన్నప్పటికీ బంగారం ధరలు పెరగకపోవడం గమనార్హం. పైగా ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు కొంత మేర సరిదిద్దుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

