Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బిజినెస్​తాజా వార్తలు

March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మార్చి 14న హైదరాబాద్ సహా పలు నగరాల్లో బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1500కుపైగా తగ్గగా, వెండి ధరలు రూ.10 వేలకుపైగా పడిపోయాయి.

Naresh chandan
Last updated: మార్చి 14, 2026 8:38 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అక్షరటుడే, హైదరాబాద్: March 14 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో Silver Prices కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్ మార్కెట్లో మార్చి 14వ తేదీ (శనివారం) నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ముఖ్యంగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న మహిళలకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించినట్టైంది. మార్కెట్ నిపుణుల ప్రకారం నిన్న ఒక్కరోజులోనే బంగారం ధరలు రూ.1500కుపైగా తగ్గాయి.

గత రెండు మూడు రోజుల ట్రెండ్‌ను పరిశీలిస్తే తులం బంగారం ధర దాదాపు రూ.3000 వరకు తగ్గింది. అదే విధంగా వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఒక్కరోజులోనే వెండి ధర కిలోకు రూ.10 వేలకుపైగా తగ్గుముఖం పట్టింది.

March 14 Gold Rates | త‌గ్గుతున్న ధ‌ర‌లు..53

తాజా మార్కెట్ ధరలను పరిశీలిస్తే..

  • హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
  • దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,830 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,440గా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,290గా కొనసాగుతోంది.
  • చెన్నైలో మాత్రం బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,550గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,990గా నమోదైంది.
  • బెంగళూరు, కేరళలో కూడా హైదరాబాద్ ధరలతో సమానంగా 24 క్యారెట్ల బంగారం రూ.1,60,680, 22 క్యారెట్ల బంగారం రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
  • March 14 Gold Rates |

వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది. ఇతర నగరాల్లో మాత్రం ఇది కొంచెం తక్కువగా ఉండి సుమారు రూ.2,79,800 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ మారడానికి అనేక కారణాలు ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ఇంపోర్ట్ డ్యూటీలు, పన్నులు వంటి అంశాలు కీలకంగా ప్రభావం చూపుతాయి. ఈ అన్ని అంశాల సమ్మిళిత ప్రభావంతోనే దేశవ్యాప్తంగా రోజువారీగా బంగారం ధరలు Gold Rates నిర్ణయించబడతాయి.

పెళ్లిళ్లు, పండుగలు వంటి శుభకార్యాల్లో బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే ధరలు తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
CDK india | ‘సీడీకే’ కన్వర్జెన్స్ 2026.. ఉద్యోగుల కుటుంబాలతో కలిసి భారతీయ మూలాల వేడుక
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
TAGGED:bullion market Indiadaily gold rates Indiagold price drop newsgold price today indiagold silver market trendsHyderabad gold ratesMarch 14 gold ratessilver price today India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు! Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Next Article BCCI ODI Plans BCCI ODI Plans | 2027 వన్డే వరల్డ్‌కప్ లక్ష్యం.. బీసీసీఐ కొత్త వ్యూహం, మరిన్ని వన్డే మ్యాచ్‌లు ఆడ‌నున్న టీమిండియా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?