అక్షరటుడే, హైదరాబాద్: March 15 Gold Rates | భారతదేశంలో బంగారం ధరలు Gold Rates అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మారుతూ ఉన్నాయి. తాజాగా అమెరికా–ఇరాన్ IRAN మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరిగింది.
దీంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండికి డిమాండ్ కొంత తగ్గి ధరలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,59,660 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,350గా నమోదైంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప తేడాలతో ఉన్నాయి.
March 15 Gold Rates | మహిళలకి గుడ్ న్యూస్..
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,61,020 – 22 క్యారెట్ల ధర రూ.1,47,600గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,810 – 22 క్యారెట్ల ధర రూ.1,46,500
- కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
- హైదరాబాద్లో Hyderabad 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
- విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
- విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
March 15 Gold Rates |
ఇక వెండి ధరలు Silver Prices విషయానికి వస్తే.. వెండి ధరలు కూడా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతున్నాయి. దేశ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.280 కాగా, కిలో వెండి ధర రూ.2,80,000గా ఉంది. సాధారణంగా దక్షిణాది నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో వెండి ధరలు ఉత్తరాది నగరాలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు రావడంతో పాటు అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. శుక్రవారం జరిగిన తొలి చర్చల తర్వాత డాలర్ డిమాండ్ పెరగడంతో బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడులపై ఒత్తిడి పెరిగింది. దీనివల్ల ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

