Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట

బిజినెస్​తాజా వార్తలు

March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగిస్తోంది. కొన్ని నెల‌లుగా చుక్క‌ల‌నంటిన బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గ‌డంతో కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయ‌ని అంటున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 16, 2026 8:47 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట

అక్షరటుడే, హైదరాబాద్: March 16 Gold Rates | దేశవ్యాప్తంగా బంగారం Gold కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట కలిగించే వార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. ఇదే సమయంలో మార్కెట్ విశ్లేషకులు కూడా మరికొన్ని రోజుల పాటు బంగారం ధరలు ఇలాగే స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Contents
  • March 16 Gold Rates | ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
    • March 16 Gold Rates | వెండి ధరల్లో

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ విలువలో మార్పులు, డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో ధరలు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వారం ప్రారంభంలోనే మరోసారి బంగారం ధరలు కొద్దిగా తగ్గడం గమనార్హం.

March 16 Gold Rates | ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో Hyderabad 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,59,650గా ఉంది. నిన్నటి రోజుతో పోల్చితే ఇది స్వల్పంగా తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,340గా కొనసాగుతోంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,59,650గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,46,340గా కొనసాగుతోంది.

చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోల్చితే బంగారం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,010గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,590 వద్ద ట్రేడవుతోంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో Bangalore 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,650గా కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,340గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,800గా నమోదైంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,490గా కొనసాగుతోంది.

March 16 Gold Rates | వెండి ధరల్లో

వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,74,900గా ఉంది. నిన్నటి రోజుతో పోల్చితే ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,79,900గా కొనసాగుతోంది. నిన్న ఈ ధర సుమారు రూ.2.80 లక్షల వద్ద ఉండగా ఇప్పుడు కొద్దిగా తగ్గింది. చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.2,79,900గా కొనసాగుతోంది. అదే సమయంలో బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,74,900గా నమోదైంది.

దేశవ్యాప్త చమురు రీసైక్లింగ్ కోసం ఇండియన్ ఆయిల్, రీ సస్టైనబిలిటీ ఒప్పందం
Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
Fortune Atta | ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ పిండి ఉత్పత్తుల శ్రేణి విస్తరణ.. ‘ఫార్చ్యూన్ మల్టీగ్రైన్ అట్టా’ విడుదల
Telangana School Hostel | హాస్టళ్లను తనిఖీ చేసిన ఎంఈవో.. కేర్​టేకర్​ను తొలగించాలని ఆదేశం..
TAGGED:bullion market Indiagold price update indiagold prices india todayGold Rate DelhiGold Rate Hyderabadmarch 16 gold ratessilver prices today indiatoday gold rate 24 carat
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్ March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Next Article Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్! Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?