అక్షరటుడే, న్యూఢిల్లీ: March 16 Pre Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రారంభమైన యుద్ధం(War) మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు వంద డాలర్లపైనే ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది.
గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ గ్యాప్ అప్‌లో ప్రారంభం కావొచ్చు.
March 16 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.93 శాతం, ఎస్ అండ్ పీ 0.61 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.43 శాతం లాభంతో ఉంది.
March 16 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.92 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 0.61 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.43 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.33 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.24 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.08 శాతం లాభంతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 1.20 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.81 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.47 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.25 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 11వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 10.716 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 13వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 9,977 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.86 నుంచి 0.75 కు తగ్గింది.
- విక్స్ 5.24 శాతం పెరిగి 22.64 కు చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు బలహీనపడి 92.45 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104.03 డాలర్లకు చేరింది.
- యూఎస్ జీడీపీ వద్ధి అంచనాలకన్నా మందగించింది. గత త్రైమాసికంలో 1.4 శాతం వద్ధి నమోదవుతుందని అంచనా వేయగా.. 0.7 శాతం వార్షిక సగటు నమోదయ్యింది.

