Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 17 Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 17 Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

బిజినెస్​తాజా వార్తలు

March 17 Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా మారాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh chandan
Last updated: మార్చి 17, 2026 8:16 ఉద.
Naresh chandan
1 వారం ago
Share
March 17 Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
March 17 Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: March 17 Pre Market Analysis | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. మార్కెట్లు కోలుకుంటున్నాయి. గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు(European markets) లాభాలతో ముగియగా.. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలిస్తోంది.

Contents
  • March 17 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • March 17 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

March 17 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో ఏఐ సంబంధిత స్టాక్స్ రాణించాయి. దీంతో నాస్‌డాక్(Nasdaq) 1.22 శాతం, ఎస్ అండ్ పీ 1.01 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.01 శాతం నష్టంతో ఉంది. మెటా 2.3 శాతం, అమెజాన్ 1.96 శాతం, ఎన్వీడియా 1.6 శాతం, మైక్రో సాఫ్ట్ 1.11 శాతం, టెస్లా 1.1 శాతం, ఆపిల్ 1.08 శాతం పెరిగాయి.

March 17 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.55 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 0.50 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.31 శాతం లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్నా.. ఇతర దేశాల షిప్‌లను అడ్డుకోబోమన్న ఇరాన్ ప్రకటనతో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.61 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.54 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.53 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.19 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.53 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.35 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.42 శాతం లాభంతో కొనసాగుతుండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 12వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 9,365 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 14వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 12,593 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PC) 0.75 నుంచి 1.03 కి చేరింది. పీసీఆర్ ఒకటిపైన ఉండడం మార్కెట్‌లో ఏర్పడిన బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తుంది.
  • విక్స్ 4.6 శాతం తగ్గి 21.6 వద్ద ఉంది. విక్స్ 18 పైన ఉండటం మార్కెట్‌లో ఒడుదుడుకుల తీవ్రతను సూచిస్తోంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలపడి 92.42 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 102.57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
  • భారత్‌లో నిరుద్యోగిత రేటు జనవరిలో 5 శాతం ఉండగా.. ఇది ఫిబ్రవరికి 4.9 శాతానికి తగ్గింది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Geo Spatial Technology India | జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు
Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!
iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
March 19 Horoscope | కొత్త తెలుగు సంవత్సరంలో కొత్త కెరీర్.. ఉగాది శుభవేళ కష్టానికి తగిన గుర్తింపు.. ఈ రాశుల వారి కల నెరవేరే సుముహూర్తం ఇదే!
Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
TAGGED:asian marketsgift nifty signalsGlobal MarketsIndian Stock MarketMarch 17 Pre Market AnalysisNifty TodayPre Market Analysisstock market newsus stock market
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sleep Fatigue Causes | కంటి నిండా నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్టే! Sleep Fatigue Causes | కంటి నిండా నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్టే!
Next Article interio0 గోద్రెజ్ ఇంటీరియో భారీ విస్తరణ: రూ. 150 కోట్ల ఆదాయమే లక్ష్యం, వినూత్న పరుపుల శ్రేణి విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?