అక్షరటుడే, హైదరాబాద్: March 21 Gold Rates | గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలకు చేరుకున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి జారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి.
మార్చి 21, 2026 నాటికి హైదరాబాద్ Hyderabad మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,48,900గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,540కి పడిపోయింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా తగ్గి, గ్రాము రూ.259.90 వద్ద ఉండగా, కిలో రూ.2,59,900కు చేరుకుంది.
March 21 Gold Rates | తగ్గుతున్న ధరలు..
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,190 కాగా, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రూ.1,48,900 వద్ద కొనసాగుతోంది.
కేరళలో Kerala 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,900, 22 క్యారెట్ల ధర రూ.1,36,540 గా ఉంది. ఢిల్లీలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. అక్కడ ధర రూ.1,49,050గా నమోదైంది.
March 21 Gold Rates | డాలర్ బలపడటం
ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు వెళ్లడం, రూపాయి మార్పిడి విలువలో మార్పులు నిలిచాయి. ప్రస్తుతం ధరలు తగ్గిన నేపథ్యంలో బంగారం Gold కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
అయితే భవిష్యత్తులో ధరలు మరింత తగ్గుతాయా లేదా పెరుగుతాయా అన్నది గ్లోబల్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు సమయంలో హాల్‌మార్క్ గుర్తులు తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

