అక్షరటుడే, వెబ్‌డెస్క్: March 22 Horoscope | జాతకచక్రం ప్రకారం నేడు (ఆదివారం, మార్చి 22) చాలా రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసిరానుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందడమే కాకుండా, రావలసిన పాత బాకీలు వసూలై ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
అయితే, గ్రహ గతులను బట్టి కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వాదనలు, పట్టింపుల వల్ల మనశ్శాంతి కరువయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ జాతక రీత్యా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు.
March 22 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: ఇవాళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అప్పుల కోసం వచ్చే వారిని సున్నితంగా పక్కన పెట్టడం మంచిది. ఆఫీసులో లేదా వ్యాపారంలో పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీతో ఉండేవారితో అనవసరమైన గొడవలకు దిగకండి. ఏదైనా సమస్య వస్తే ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి.
March 22 Horoscope | వృషభం, మిథునం..
వృషభ రాశి: మీ కష్టానికి కుటుంబ సభ్యుల మద్దతు తోడవుతుంది. దీనివల్ల అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి.. ఎలా పొదుపు చేయాలో ఒక స్పష్టత వస్తుంది. సెమినార్లు లేదా ఎగ్జిబిషన్లకు వెళ్లడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు ఉపయోగపడే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
మిథున రాశి: పిల్లల పట్ల కఠినంగా ఉండకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం లేదా ఉద్యోగ విషయాల్లో తండ్రి ఇచ్చే సలహాలు బాగా కలిసి వస్తాయి. తమ్ముడితో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది.
March 22 Horoscope | కర్కాటకం, సింహం..
కర్కాటక రాశి: ఇవాళ ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవాళ సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంది. పనులను ప్లాన్ ప్రకారం చేసుకోవడం మంచిది.
సింహ రాశి: చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి అనుకోని విధంగా డబ్బు అందుతుంది. దీనివల్ల సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే కుటుంబ సభ్యులందరి అభిప్రాయం తీసుకోండి. వాస్తవాలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే బంధువులతో మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం ఉంది. దీనివల్ల కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.
March 22 Horoscope | కన్యా, తులా..
కన్యా రాశి: గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న టెన్షన్ల నుంచి విముక్తి లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైన సమయంలో సన్నిహితుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఇవాళ ఒక తీపి కబురు వింటారు. దీనివల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
తులా రాశి: మీ తెలివితేటలు, జ్ఞానాన్ని ఉపయోగించి మనసుని వేధిస్తున్న పాత సమస్యలను ఇవాళ పరిష్కరించుకోగలుగుతారు. బిజినెస్ అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి సంబంధించి సన్నిహితుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దూరప్రాంతం లేదా విదేశాల నుంచి వచ్చే శుభవార్త కోసం మరికొంత కాలం వేచి ఉండాలి.
March 22 Horoscope | మిగతా రాశులు..
వృశ్చిక రాశి: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోండి. ఆర్థికంగా ఇవాళ బాగుంటుంది. గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే, ఆ డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే, వ్యాపారస్తులు తమ భవిష్యత్తు ప్రణాళికలను లేదా ఆలోచనలను ఒకసారి మళ్లీ చెక్ చేసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి: ఇంట్లోని పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్యం కొంచెం పాడవ్వచ్చు. దీనివల్ల కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వచ్చే కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్లాన్లను ఒకసారి సరిచూసుకోవడానికి ఇది సరైన సమయం. కష్టాల్లో తోడుగా ఉండే ఒక మంచి స్నేహితుడి వల్ల ఇవాళ చాలా ఆనందాన్ని పొందుతారు.
మకర రాశి: దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరై ప్రయాణం చేస్తే, కొత్త వ్యక్తులను కలవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ప్రేమ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడిని కలుస్తారు.
కుంభ రాశి(కుంభం): చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యను వేగవంతమైన నిర్ణయాలతో పరిష్కరించుకుంటారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులపై మీ అధికారాన్ని చలాయించాలని చూస్తే అనవసరమైన వాదనలు జరిగి, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీన రాశి: ఇంటి అవసరాల కోసం భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనివల్ల ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇవాళ దొరికిన ఖాళీ సమయంలో ఇష్టమైన పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, సంపద పెరగాలంటే.. శివలింగానికి అభిషేకం చేయండి.
ఇది కూడా చదవండి: Parabhava Year Horoscope | పంచాంగ శ్రవణం ఆలకిద్దామా.. శ్రీ పరాభవ నామ సంవత్సర అదృష్ట రాశులు ఇవే!

