Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు

బిజినెస్​తాజా వార్తలు

March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు

దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం నుంచి భారీగా పడిపోతూ 11% వరకు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం రూ.1,45,960గా నమోదవగా, వెండి ధర కిలోకు రూ.2,49,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఈ వారం కూడా ధరలు తగ్గే అవకాశముందని నిపుణుల అంచనా.

Naresh chandan
Last updated: మార్చి 23, 2026 8:35 ఉద.
Naresh chandan
5 రోజులు ago
Share
March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు

అక్షరటుడే, హైదరాబాద్: March 23 Gold Rates | బంగారం, వెండి ధరలు గత వారం నుంచి గణనీయంగా పడిపోతూ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. పసిడి ధరలు దాదాపు 11 శాతం వరకు తగ్గడం పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Contents
  • March 23 Gold Rates | ప‌డిపోతున్న ధ‌ర‌లు..
    • March 23 Gold Rates | కీలక పరిణామం

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడటంతో పాటు, గ్లోబల్ ఎకానమీ అనిశ్చితి కూడా ధరలపై ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 23న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960గా నమోదవగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.

అదే సమయంలో వెండి ధర Silver Price కూడా గణనీయంగా తగ్గి కిలోకు రూ.2,49,900గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.

March 23 Gold Rates | ప‌డిపోతున్న ధ‌ర‌లు..

చెన్నైలో Chennai 24 క్యారెట్ బంగారం ధర రూ.1,48,570గా ఉండగా, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో రూ.1,45,960 వద్ద ఉంది. వెండి ధరలు కూడా చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రూ.2,49,900గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో రూ.2,44,900 వద్ద కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పడిపోతూనే ఉన్నాయి. గత వారం ఔన్స్ బంగారం ధర 4,508 డాలర్ల వద్ద ముగియగా, ప్రస్తుతం ఇది 4,000 డాలర్ల స్థాయికి చేరుతుందా అనే చర్చ మొదలైంది. అలాగే వెండి ఔన్స్ ధర 68 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, ఇది 60 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

March 23 Gold Rates | కీలక పరిణామం

ఈ వారం కూడా ధరలు Rates ఇదే విధంగా తగ్గుదల దిశగా కదిలే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకొచ్చే అవకాశం ఉండగా, పెట్టుబడిదారులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద బంగారం, వెండి ధరల తగ్గుదల భారత మార్కెట్‌లో కీలక పరిణామంగా మారింది.

Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు!
Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
TAGGED:commodity marketgold investmentgold newsgold price fallgold rates todayIndia bullion marketMarch 23 Gold Ratesmarket trendsSilver Prices
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article Iran US tensions Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?