Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

బిజినెస్​తాజా వార్తలు

March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. ప్రధాన స్టాక్ మార్కెట్లన్నీ నష్టాల బాటలో సాగుతున్నాయి.

Naresh chandan
Last updated: మార్చి 23, 2026 8:22 ఉద.
Naresh chandan
4 రోజులు ago
Share
March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: March 23 Pre Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. క్రూడ్ ఆయిల్(Crude oil) ధర భారీగా పెరగడం, గ్యాస్‌కొరతలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండటంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి.

Contents
  • March 23 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • March 23 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగియగా.. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉండటంతో మన మార్కెట్లు కూడా భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

March 23 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 2.01 శాతం, ఎస్ అండ్ పీ 1.51 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.21 శాతం లాభంతో ఉంది.

March 23 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 2.05 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.86 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.46 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 5.23 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.55 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.78 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.17 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.67 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.49 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.34 శాతం నష్టంతో కొనసాగుతుండటంతో మన మార్కెట్లు కూడా భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 15వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,518 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 17వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,706 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.91 నుంచి 0.93కి పెరిగింది.
  • విక్స్ 0.04 శాతం పెరిగి 22.81 వద్ద ఉంది. విక్స్ 18 పైన ఉండటం మార్కెట్‌లోని ఒడుదుడుకులను సూచిస్తోంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 93.71 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 112.19 డాలర్లకు చేరింది.
Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
Piles Treatment Tips | పైల్స్ వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండిలా!
March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!
TAGGED:crude oil pricesFII DII dataGift NiftyGlobal MarketsIndia stocksMarch 23 Pre Market Analysismarket crashShare market todaystock market news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Home Cleaning Tips | ఇంట్లో వీటిని శుభ్రం చేయడం లేదా.. అయితే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే! Home Cleaning Tips | ఇంట్లో వీటిని శుభ్రం చేయడం లేదా.. అయితే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే!
Next Article March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?