Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 24 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ పతనం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 24 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ పతనం!

బిజినెస్​తాజా వార్తలు

March 24 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ పతనం!

యుద్ధ భయాలు, యూఎస్ బాండ్ల రాబడుల పెరుగుదల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం రూ.1.35 లక్షలకు దిగివచ్చింది. మంగ‌ళ‌వారం దేశంలోని ప్ర‌ధాన న‌గరాల‌లో కూడా ధ‌ర‌లు దిగి వ‌చ్చాయి.

Naresh chandan
Last updated: మార్చి 24, 2026 8:10 ఉద.
Naresh chandan
3 రోజులు ago
Share
March 24 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ పతనం!
March 24 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ పతనం!

అక్షరటుడే, హైదరాబాద్: March 24 Gold Rates | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై గట్టి ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యుద్ధ భయాలు గరిష్ట స్థాయికి చేరుకోవడం, అమెరికా America బాండ్లపై రాబడులు పెరగడం వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లడంతో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Contents
  • March 24 Gold Rates | తాత్కాలిక విరామం ప్ర‌క‌టన‌తో…
    • March 24 Gold Rates | ప్రధాన నగరాల్లో..

ఈ ప్రభావంతోనే మార్చి 24 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం 24 క్యారెట్ బంగారం స్పాట్ ధర రూ.1,35,640కు చేరుకోగా, 22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర రూ.1,24,340 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,29,900గా నమోదైంది.

March 24 Gold Rates | తాత్కాలిక విరామం ప్ర‌క‌టన‌తో…

మార్చి 23న దేశీయ మార్కెట్లో లోహాల ధరలు చరిత్రలోనే అరుదుగా కనిపించే స్థాయిలో పడిపోయాయి. ఒక్కరోజులోనే మేలిమి బంగారం ధర రూ.10,320 మేర తగ్గగా, వెండి ధరలో సుమారు రూ.20,000 కోత నమోదైంది. ఈ భారీ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళన రేకెత్తించింది.

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump యుద్ధ చర్యలకు తాత్కాలికంగా ఐదు రోజుల విరామం ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు కొంత శాంతించాయి. దీంతో ముడి చమురు ధరలు కూడా 100 డాలర్ల దిగువకు చేరాయి.

అయినప్పటికీ, డాలర్ బలపడటం మరియు యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు అధికంగా ఉండటం వల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

March 24 Gold Rates | ప్రధాన నగరాల్లో..

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు Gold Rates దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,39,190 ఉండగా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, విజయవాడ, కేరళ, పుణే వంటి నగరాల్లో రూ.1,35,640 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ లో రూ.1,35,790గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధరలు కూడా ఇదే విధంగా స్వల్ప తేడాలతో నమోదవుతున్నాయి. వెండి ధరలు దేశవ్యాప్తంగా దాదాపు స్థిరంగా ఉండి చెన్నైలో రూ.2,34,900గా ఉండగా, మిగతా నగరాల్లో రూ.2,29,900 వద్ద కొనసాగుతున్నాయి.

మొత్తానికి, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలపై కీలక ప్రభావం చూపిస్తున్నాయి. యుద్ధ ఉద్రిక్తతలు, డాలర్ బలం, బాండ్ల రాబడులు వంటి అంశాలు కలిసి మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి

Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
TAGGED:bullion marketgold price fallgold rates todayindia gold pricelatest gold newsMarch 24 Gold Rates |Silver price todaysilver rates india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article World TB Day World TB Day | క్షయ వ్యాధి ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటి.. చికిత్స ఎలా..!
Next Article March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?