అక్షరటుడే, న్యూఢిల్లీ: March 24 Pre Market Analysis | ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నందున ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రణాళికబద్ధమైన దాడులను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు(US President) ట్రంప్ చెప్పడంతో మార్కెట్లు కాస్త ఊరట చెందాయి.
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తుండడంతో చాలా దేశాల స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లు పాజిటివ్‌గా.. యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి.
ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. అయితే గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) భారీ లాభాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
March 24 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 1.38 శాతం, ఎస్ అండ్ పీ 1.15 శాతం లాభపడ్డాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.37 శాతం నష్టంతో ఉంది.
March 24 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 1.21 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.78 శాతం లాభంతో ఉండగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.24 శాతం నష్టపోయింది.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.86 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.50 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.26 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.25 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.15 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.05 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.73 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 16వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 10,414 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 18వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 12,033 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.93 నుంచి 0.84 కు పడిపోయింది.
విక్స్ 17.17 శాతం పెరిగి 26.73 కు చేరింది. 2024 జూన్ తర్వాత విక్స్ ఈ లెవల్‌కు చేరడం ఇదే మొదటిసారి. విక్స్ 18 పైన ఉండడం మార్కెట్‌లోని ఒడిదుడుకులను సూచిస్తోంది. - డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు బలహీనపడి 93.97 వద్ద ఉంది.
- మధ్య ప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు టెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్(Trump) ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చడంతో ముడి చమురు ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103.44 డాలర్లకు చేరింది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

