అక్షరటుడే, న్యూఢిల్లీ: March 25 Pre Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లు నష్టాలతో, యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి.
బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. అయితే గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
March 25 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.84 శాతం, ఎస్ అండ్ పీ 0.37 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.91 శాతం లాభంతో ఉంది.
March 25 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.71 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.23 శాతం లాభపడగా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 0.07 శాతం నష్టపోయింది.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.15 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 2.42 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.37 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.99 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.91 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.68 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.56 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 17వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,009 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు వరుసగా 19వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,867 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.84 నుంచి 1.7 కు పెరిగింది.
- విక్స్ 7.44 శాతం తగ్గి 24.74 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలపడి 93.87 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. బ్యారెల్‌కు 6.55 శాతం తగ్గి 97.95 డాలర్ల వద్ద ఉంది.

