Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!

బిజినెస్​తాజా వార్తలు

March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో కమోడిటీ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఇటీవల భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతూ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌డంతో సామాన్యులు గ‌గ్గోలు పెడుతున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 26, 2026 8:50 ఉద.
Naresh chandan
13 గంటలు ago
Share
March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!

అక్షరటుడే, హైదరాబాద్: March 26 Gold Rates | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు Silver Prices తిరిగి పుంజుకోవడం ప్రారంభించాయి.

Contents
  • March 26 Gold Rates | ఔన్స్​ ధర..
    • March 26 Gold Rates |  ప్రధాన నగరాల్లో..

ఇటీవల గణనీయంగా పడిపోయిన ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మార్చి 26 ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,680గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,460 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక వెండి ధర కిలోకు రూ.2,60,100కు చేరింది. నిన్న ఒక్కరోజులోనే బంగారం Gold , వెండి ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,760 పెరిగితే, 22 క్యారెట్ల బంగారం రూ.3,450 మేర ఎగబాకింది. వెండి ధర అయితే ఏకంగా రూ.15,000 పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

March 26 Gold Rates | ఔన్స్​ ధర..

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,535 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి ఔన్స్ ధర 71 డాలర్ల వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్‌లోని ఈ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

March 26 Gold Rates |  ప్రధాన నగరాల్లో..

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు Gold Rates దాదాపు సమానంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,48,380గా ఉండగా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రూ.1,46,680 వద్ద ఉంది.

న్యూఢిల్లీలో రూ.1,46,830గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. వెండి ధరల విషయంలో చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కిలో ధర రూ.2,60,100గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో రూ.2,50,100గా కొనసాగుతోంది.

మొత్తానికి, పశ్చిమాసియా పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుండటం, డాలర్ Dollar మార్పిడి విలువల్లో మార్పులు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ అన్నీ కలిసివచ్చి బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Junk Food Cravings | జంక్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే!
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
TAGGED:commodity market newsgold investmentGold price Indiagold rates todayIndia bullion marketMarch 26 Gold RatesPrecious metals IndiaSilver Prices Today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Markapuram Bus Accident Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Next Article Padma River Bus Accident Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?