Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..!

భక్తితాజా వార్తలు

March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..!

పురాతన జ్యోతిషశాస్త్రంలో జాతకచక్ర అంచనాలనేది ఒక ప్రాథమిక విధానం. దీని ద్వారా వ్యక్తి, స్థలం, భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. జరగబోయే ఘటనల గురించి అంచనా వేయొచ్చు.

Naresh chandan
Last updated: మార్చి 2, 2026 11:19 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..!
March 3 Horoscope | హోలీ రోజున అద్భుత ఫలితాలు ఇచ్చే రాశులు ఇవే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: March 3 Horoscope | గ్రహ సంచారం నేడు (మంగళవారం, మార్చి 3) పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కలిగించనున్నాయి. కొందరికి దాంపత్య  జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతోంది..

March 3 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వాలి. ఖర్చులు పెరగడం గమనించాలి. కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని కేటాయించాలి. ప్రియమైనవారు మిమ్మల్ని కొన్నివిషయాలు అడుగుతారు. కానీ వారి ఆశలు నెరవేర్చలేరు. దీనివల్ల ప్రియమైనవారు విచారానికి లోనవుతారు. కింద పనిచేసే వారు మీకు సహాయంగా ఉంటారు. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ప్రేమ సూర్యోదయం అవుతుంది.
వృషభ రాశి: చుట్టు పక్కల వారి సహాయంతో సంతోషం కలుగుతుంది. భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే నేటి నుంచే పొదుపు చెయ్యాలి.  కుటుంబ సభ్యులతో కాసేపు రిలాక్స్ అవ్వండి. ప్రేమ వ్యవహారంలోకి మూడో వ్యక్తి జోక్యం కలగొచ్చు. సమస్య రాకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్​కు తీసుకెళ్లడం ద్వారా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి.
మిథున రాశి: మీ వ్యక్తిత్వం సుగంధభరితమైనది. మీ అంకిత భావం, కష్టపడి చేసే తత్వం గుర్తింపు పొందుతాయి. అవి ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి. బంధువుల వద్దకు వెళ్ళడం ఊహించినదానికన్నా బాగుంటుంది. స్నేహితుడు వెంట లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఆఫీసులో మంచి మార్పును ఆస్వాదిస్తారు. ఈరోజు ఆకస్మికంగా అనవసర ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తోంది.
కర్కాటక రాశి: చెడు అలవాట్లు ప్రమాద ఫలితాలను చూపుతున్నాయి. ఖర్చు పెరుగుతుంది. మీకు స్నేహితులు, దగ్గరివారు సహాయ హస్తాన్ని అందిస్తారు. భావోద్వేగాలు చికాకు పెడతాయి. అన్నింటికీ ప్రేమే ప్రత్యామ్నాయమని తెలుసుకుంటారు. జీవితభాగాస్వామితో బయటకు వెళతారు. అయినా కూడా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం వల్ల అప్​సెట్​ అవుతారు.

March 3 Horoscope | సింహ రాశి:

ఆధ్యాత్మికత, శారీరకంగా ధ్యానం, యోగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎప్పటి నుంచో చేస్తున పొదుపు ఈరోజు ఆదుకుంటుంది. ఖర్చులు బాధిస్తాయి. పిల్లల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. శ్రీమతితో భావోద్వేగపు దోపిడీని మానుకోవాలి. చిల్లర, టోకు వ్యాపారులకి మంచి రోజు. రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల వైవాహిక జీవితం ఒత్తిడికి లోనవుతుంది.

March 3 Horoscope | కన్యా రాశి:

సానుకూల ఆలోచనలు చెయ్యాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తంగా ఉండాలి. ప్రేమ విషయాల్లో చోటుచేసుకునే మార్పులు కలత కలిగించవచ్చు. నేడు చేయబోయే ప్రయాణాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వైవాహిక జీవితంలో బంధువుల కారణంగా స్వల్ప విభేదాలు తలెత్తవచ్చు.

March 3 Horoscope |తులా రాశి:

నేడు మీకు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఓర్పు, సమయస్ఫూర్తి ఉంటే విజయాలు దరి చేరుతాయి. పెండింగు బకాయిలు చేతికి అందుతాయి. ఫలితంగా ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో అనుకూల పరిణామాలు ఉండనున్నాయి. దాంపత్య జీవితం ప్రత్యేకంగా ఉంటుంది.

ధనుస్సు రాశి: ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అతిథుల రాకతో కుటుంబంలో ఉత్సాహం పెరుగుతుంది. ఖాళీ సమయంలో పెండింగు పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో నేడు సర్‌ప్రైజ్‌లు ఉండవచ్చు.

మకర రాశి: ఆధ్యాత్మికత, భక్తిపై ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వచ్చే ఆదాయం దానిని సమతుల్యం చేస్తుంది. సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. కుటుంబ బాధ్యతలకు సమయం కేటాయించాలి. దాంపత్యంలో చిన్న విభేదాలు తలెత్తవచ్చు.

కుంభ రాశి: ప్రత్యేకమైన మీ ఆకర్షణీయ ప్రవర్తన అందరి నుంచి ప్రశంసలు అందిస్తుంది. సురక్షిత పెట్టుబడులు చాలా మంచివి. ప్రేమలో కొత్త కోణం ఈ రోజు కనిపిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు గోచరిస్తోంది. వైవాహిక జీవితంలో జాగ్రత్త అవసరం.

మీన రాశి: మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఖర్చులపై నియంత్రణ పాటించాలి. స్నేహితులతో నేడు ఆనంద క్షణాలు గడుపుతారు. ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. వైవాహిక జీవితం నేడు ఆనందాన్ని ఇస్తుంది.

Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..
Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
TAGGED:astrology updatesDaily rasi phalaluFinancial astrologyLove and career horoscopeMarch 3 horoscopeMarital life predictionsTelugu horoscope todayzodiac predictions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
Next Article SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన! SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
5 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?