Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బిజినెస్​తాజా వార్తలు

March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కొన్ని రోజులుగా ఊగిసలాడుతూ ఉన్న బంగారం, వెండి ధరలు మార్చి 30న స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాల్లో ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులు కొంత ఉపశమనం పొందుతున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 30, 2026 9:22 ఉద.
Naresh chandan
11 గంటలు ago
Share
March 30 Gold Rates
March 30 Gold Rates

అక్షరటుడే, హైదరాబాద్: March 30 Gold Rates | దేశంలో బంగారం, వెండి ధరలలో Silver Prices గత కొన్ని రోజులుగా భారీగా మార్పులు చోటు చేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇటీవల భారీగా తగ్గిన ధరలు ఆత త‌ర్వాత మ‌ళ్లీ పెరిగాయి. అయితే మార్చి 30 సోమవారం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.

Contents
  • March 30 Gold Rates | తెలుగు రాష్ట్రాల్లో..
    • March 30 Gold Rates | ప్రభావితం చేస్తున్న అంశాలు..

March 30 Gold Rates | తెలుగు రాష్ట్రాల్లో..

ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,080గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,740 వద్ద ట్రేడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,080 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,740గా ఉంది. వెండి ధరలు కూడా గణనీయంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా ఇదే ధరలు నమోదవడం గమనార్హం.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,080గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,740గా ఉంది.

ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే చెన్నైలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,49,010, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,590 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరల విషయానికి వస్తే, ముంబై, ఢిల్లీ, బెంగళూరు Bangalore నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. ఇది మార్కెట్ పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

March 30 Gold Rates | ప్రభావితం చేస్తున్న అంశాలు..

బంగారం, వెండి ధరలపై అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అమెరికా డాలర్ బలం, ద్రవ్యోల్బణం, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

అలాగే వెండి ధరలు Silver Prices పారిశ్రామిక వినియోగం, పెట్టుబడిదారుల డిమాండ్, అంతర్జాతీయ ట్రెండ్‌ల ఆధారంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం స్వల్పంగా తగ్గిన ధరలు కొనుగోలుదారులకు అనుకూలంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
Summer Hailstorms | మండే ఎండల్లో మంచు ముక్కలు.. వేసవిలోనే వడగళ్ల వర్షం కురవడానికి కారణమేంటంటే!
Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
TAGGED:bullion market Indiagold market newsGold Price Updategold rates todayindia gold priceMarch 30 Gold Ratessilver prices indiaSilver Rate Today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Visakhapatnam Murder Case Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్​లో దాచి!
Next Article Amaravati Capital Decision Amaravati Capital Decision | కీలక అడుగు..అసెంబ్లీలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఏకగ్రీవ తీర్మానం, ఏప్రిల్ 1న ఆమోదించ‌నున్న కేంద్రం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?