అక్షరటుడే, న్యూఢిల్లీ: March 30 Pre Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో మొదలైన యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించింది. ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లూ నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నష్టాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
March 30 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ ప్రభావంతో వాల్‌స్ట్రీట్(Wallstreet) సైతం కుప్పకూలుతోంది. యూఎస్‌కు చెందిన మూడు ప్రధాన సూచీలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 2.15 శాతం, ఎస్ అండ్ పీ 1.67 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.37 శాతం నష్టంతో ఉంది.
March 30 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 1.40 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.87 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.05 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 4.71 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 3.94 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.88 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.78 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.21 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.15 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 19వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,367 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 21వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,566 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.21 నుంచి 0.94 కు తగ్గింది.
- విక్స్ 8.78 శాతం పెరిగి 26.8 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 పైసలు బలహీనపడి 94.81 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 3.23 శాతం పెరిగి 115.88 డాలర్ల వద్ద ఉంది.
- ఫిబ్రవరి నెలకు సంబంధించిన దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఈరోజు విడుదల కానున్నాయి.
- ఈరోజు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ప్రసంగం ఉంది. వడ్డీ రేట్ల కోత విషయంలో ఆయన కామెంటరీ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉన్నారు.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్ వేషధారణలో అలరించిన కేఆర్ నాగరాజు!
