అక్షరటుడే, హైదరాబాద్: March 31 Gold Rates | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం బంగారం, వెండి ధరల్లో Silver Prices స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ పెరగడంతో ధరలు ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కొన్ని సందర్భాలలో తగ్గుదల కూడా కనిపిస్తోంది.
March 31 Gold Rates |
దేశంలో ఈ రోజు (మార్చి 31) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,270 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,910గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,48,420కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,910గా ఉంది. దక్షిణ భారత నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది.
March 31 Gold Rates | మారుతూ ఉన్న ధరలు..
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కేరళ Kerala వంటి ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,270గా ఉండగా.. చెన్నైలో మాత్రం ఇది రూ.1,50,230కు చేరి కొంచెం ఎక్కువగా నమోదైంది. వడోదరలో రూ.1,48,320, కోల్‌కతా మరియు ముంబైలో రూ.1,48,270గా ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే, ఇటీవల గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.5 లక్షల మార్క్‌కు దగ్గరగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,55,100గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో ఇది రూ.2,44,900గా నమోదైంది.
మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చితి, పశ్చిమాసియా పరిస్థితులు, డాలర్ Dollar మార్పిడి విలువలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ధరలు ఇలాగే మారుతూ ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
