Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్​

Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్​రెడ్డి సానుభూతి తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 11:09 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
18 గంటలు ago
Share
Markapuram Bus Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్: Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ఏపీలోని మార్కాపురం జిల్లా (Markapuram District) రాయవరం సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ట్రావెల్స్​ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో మంటలు వ్యాపించడంతో 13 మంది చనిపోయారు.

Contents
  • Markapuram Bus Accident | సీఎం దిగ్భ్రాంతి
    • Markapuram Bus Accident | పవన్​​ కల్యాణ్​​ విచారం

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఒంగోలు ఎస్పీ హర్షవర్దన్​ రాజు (Ongole SP Harshavardhan Raju) ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 13 మంది మృతదేహాలు వెలికి తీశామని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన 23 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. ఒకరిద్దరికి ఫ్రాక్చర్ తప్ప మిగతావారి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.

Markapuram Bus Accident | సీఎం దిగ్భ్రాంతి

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఆంధ్రప్రదేశ్ సీఎస్​తో మాట్లాడారు.

Markapuram Bus Accident | పవన్​​ కల్యాణ్​​ విచారం

బస్సు ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికిగల కారణాలపై జిల్లా అధికారులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
TAGGED:CM Revanth ReddyDeputy CM Pawan Kalyanmarkapuram bus accidentMarkapuram DistrictOngole SP Harshavardhan Raju
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Car Accident Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం.. అంబులెన్స్, ఆరు​ బైక్​లు ధ్వంసం..
Next Article Petrol Bunk Rush Hyderabad Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?