అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Market Yard Security | మార్కెట్ యార్డులో శాంతి భద్రతల (market yard security) పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తామని సీపీ సాయి చైతన్య(cp sai chaitanya) అన్నారు. నగరంలోని మార్కెట్ యార్డును (Nizamabad market Yard) ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పసుపు విక్రయదారులతో (nizamabad news) సమావేశమయ్యారు.
Market Yard Security | గొడవలు వివాదాలు లేకుండా..
మార్కెట్ యార్డులో ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా వ్యాపారం (turmeric farmers) జరగాలని సీపీ సూచించారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. తప్పుడు తూకాలు మధ్యవర్తుల మోసాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యార్డు సిబ్బందికి (law and order) సూచించారు. మార్కెట్ చుట్టూ ట్రాఫిక్ సమస్య తగ్గించే విధంగా సహకరించాలని కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అన్ని గేట్ల వద్ద 24 గంటలు పట్టిష్టమైన నిఘా ఉంచాలని అనుమతి లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డులోకి (trader safety) రానివ్వొద్దని చెప్పారు. భద్రత కోసం సీసీ కెమెరాలు (cctv surveillance) ఏర్పాటు చేయడం అవసరమన్నారు. ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన రైతులను కోరారు. ఆయన వెంట మూడవ టౌన్ ఎస్సై శ్రీహరి బాబు, పసుపు రైతులు తదితరులున్నారు.
ఇది కూడా చదవండి: Dhannapal Indiramma houses | నిజామాబాద్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్పాల్

