అక్షరటుడే, కోటగిరి : Math Fear Students | నేటి సమాజంలో విద్యార్థులకు గణితంపై భయాందోళన నెలకొందని ఆ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కోటగిరి తహశీల్దార్ గంగాధర్ అన్నారు. మండల కేంద్రంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం హైదరాబాద్ ఎంటీఎస్ అబాకస్ (Hyderabad MTS Abacus) ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించారు. అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పరీక్షలను నిర్వహించారు.
Math Fear Students | ఎలాంటి పరికరాలు లేకుండానే..
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ఎలాంటి పరికరాలు లేకుండా విద్యార్థులు గణితంలో ప్రతిభను చూపడం అభినందనీయమన్నారు. వేదిక్ మ్యథ్స్, అబాకస్ (Vedic Maths and Abacus) భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి వాటిని నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. పట్టణ ప్రాంతాలలో రూ.వేలల్లో ఖర్చు చేసినా విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలు ఏర్పాటు చేయరని.. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు మెడల్స్ అందజేసి అభినందించారు. పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో బోధన్ విజ్ఞాన్ నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్, శ్రీవేద హైస్కూల్ కరస్పాండెంట్ రవికుమార్, ప్రిన్సిపల్ తెల్ల అక్షర, ఉపాధ్యాయ బృందం, రేష్మ, నఫీజ్, చంద్రకళ, సాయి పవన్, రమేష్ నాగరాజు, సంగీత, సునీత, అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు, భరత్, సుప్రియ, రమ్య, సంగీత తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Drinking Water | తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం..: కలెక్టర్ ఇలా త్రిపాఠి
