అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Matham Pawan Case | కుట్రతోనే నాపై తప్పుడు కేసు బనాయించారని 8వ డివిజన్ బీజేపీ (Nizamabad BJP) కార్పొరేషన్ మఠం పవన్ (Corporation Matam Pavan) తెలిపారు. ఈ మేరకు మంగళవారం వీడియో విడుదల చేశారు.
Matham Pawan Case | అక్రమంగా కేసు పెట్టారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందన్నారు. ఆ ప్రచారానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏ బిల్డర్ దగ్గర తాను డబ్బులు వసూలు చేయలేదన్నారు. కావాలనే కుట్రపన్ని తనపై కేసు బనాయించారని ఆయన పేర్కొన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ (Nizamabad Builders Association) అధ్యక్షుడు జిల్లాల రమేశ్, మాజీ కార్పొరేటర్ సదానంద్, మరో వ్యక్తి కలిసి తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ విషయమై (Nizamabad Police) 5వ టౌన్ ఎస్సై తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజమన్నారు. న్యాల్కల్ రోడ్లోని మున్సిపల్ స్థలాన్ని బిల్డర్ అసోసియేషన్లోని కొందరు, కాంగ్రెస్ లీడర్లు కబ్జా చేశారని.. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయంపై కక్షకట్టిన సదరు వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని చెప్పారు.
ఇది కూడా చదవండి: CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
