అక్షరటుడే, మెదక్ : Medak Road Accident | మెదక్ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
హవేళి ఘనపూర్ (Haveli Ghanapur) మండలం బూర్గుపల్లికి చెందిన తండ్రి కొడుకులు అమృత్ గౌడ్ (51), రిషివర్ధన్గౌడ్ (13), బొగడ భూపతిపూర్కు చెందిన సాయాగౌడ్ (32) బైక్పై వెళ్తున్నారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా రంగంపేటలో జరిగిన శుభకార్యానికి వీరు వెళ్లి తిరిగి వస్తున్నారు. సంగారెడ్డి వైపు వెళ్తున్న బస్సు వీరిని కొల్చారం మండలం రాంపూర్ వద్ద ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
Medak Road Accident | తీవ్ర విషాదం
తండ్రి కొడుకుల మృతితో బూర్గుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయాగౌడ్ సైతం అమృత్ గౌడ్ అల్లుడు కావడం గమనార్హం. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. బస్సు రూపంలో వీరిని మృత్యువు ముగ్గురిని కబళించింది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీనిని కూడా చదవండి : Hyderabad Murder Case | భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. హైదరాబాద్లో దారుణం

