Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Medchal Suicide Case | మేడ్చల్‌లో దారుణం: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన కిరాతకుడు.. భయంతో ఆత్మహత్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Medchal Suicide Case | మేడ్చల్‌లో దారుణం: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన కిరాతకుడు.. భయంతో ఆత్మహత్య

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Medchal Suicide Case | మేడ్చల్‌లో దారుణం: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన కిరాతకుడు.. భయంతో ఆత్మహత్య

పెళ్లికి ఒప్పుకోలేదన్న కక్షతో ఓ యువకుడు యువతికి బలవంతంగా హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఎక్కించడంతో, భయంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషాదం కలకలం రేపుతోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 1:16 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Medchal Suicide Case

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Medchal Suicide Case | మేడ్చల్ జిల్లా (Medchal District) పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన నిందితుడు, ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకుని అమానుషానికి ఒడిగట్టాడు.

గత నెల 11వ తేదీన జరిగిన ఈ ఘటనలో, నిందితుడు బాధితురాలిని బంధించి, ఆమెకు బలవంతంగా హెచ్ఐవి (HIV) సోకిన రక్తాన్ని శరీరంలోకి ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో యువతి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ప్రాణాంతక వ్యాధి సోకిందన్న భయం ఆమెను తీవ్రంగా కుంగదీశాయి. గత కొన్ని రోజులుగా మానసిక ఆందోళనలో ఉన్న బాధితురాలు, చివరకు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Medchal Suicide Case | బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో ఇంతటి క్రూర చర్యకు పాల్పడిన నిందితుడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు రేకెత్తించగా, ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Facebook Love Fraud | ఫేస్​బుక్​లో పరిచయమై సహజీవనం.. రూ.కోటితో పరారు

March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​
Kids Toothpaste Safety | పిల్లలు టూత్‌పేస్ట్ మింగుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
Ugadi Pachadi | షడ్​ రుచులు.. ఆరు భావాలు.. ఉగాది పచ్చడి మన జీవితానికి ఇచ్చే సందేశం ఇదే!
TAGGED:HIVlocal crime reportMedchal DistrictMedchal incidentMedchal newsPolice investigationshocking crime newssuicide case indiatelangana crimewomen safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Yashwant Varma Resignation Yashwant Varma Resignation | హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా
Next Article CV Anand DGP  CV Anand DGP | కొత్త డీజీపీగా సీవీ ఆనంద్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?