అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Meeseva Commission Increase | తమకు కమీషన్ పెంచడంపై మీసేవ ఆపరేటర్లు (Nizamabad news) హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు (commission increase) తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Meeseva Commission Increase | కమీషన్ పెంపుతో పాటు కొత్త ఛార్ట్ అమలు..
ఈ సందర్భంగా ఏఎంసీవోఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టీఎంవోఏ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ ఛార్టర్ను (citizen charter) ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని మీసేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంవోసీఏ (Telangana government), ఏఎంసీవోఏ 2025లో జేఏసీగా ఏర్పడ్డాయన్నారు. పదేళ్లుగా (Meeseva operators) తమకు కమీషన్ పెంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటే పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా కమిషన్ పెంపునకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీసేవ కమిషనర్ రవి కిరణ్‌లకు జిల్లా యూనియన్ల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కమిషన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందన్నారు.
Meeseva Commission Increase | మీసేవలకు అంతరాయం..
శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు సాంకేతిక కారణాల వల్ల సేవల్లో (e governance) అంతరాయం ఉండవచ్చని, ప్రజలు (digital services India) గమనించాలని వారు కోరారు. భవిష్యత్తులో కూడా మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పెద్దోళ్ల కిషోర్, ధర్మానందం, జీవీఆర్, శివకుమార్, విశ్వనాథ్, సంతోష్, మహమ్మద్ నజీర్ అహ్మద్, సయ్యద్ ఉబేద్ హైమద్, చింత రాజు, పెద్దోళ్ల రమేశ్వర్, తిరుపతి, శివకుమార్, పల్లికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
