Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mendora Police | యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mendora Police | యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​

నిజామాబాద్క్రైం

Mendora Police | యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​

జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలు ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 11:40 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Mendora Police

అక్షరటుడే, భీమ్​గల్/బాల్కొండ: Mendora Police | జిల్లాలోని మెండోరా మండలం (Mendora Mandal) పోచంపాడ్ గ్రామంలో పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలు ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనుమానం, డబ్బుల గొడవతో ఐదుగురు వ్యక్తులు కలిసి దండుగుల రిషిక్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జాన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Contents
  • Mendora Police | అసలేం జరిగిందంటే..?
    • Mendora Police | దర్యాప్తు నిందితుల అరెస్ట్
      • Mendora Police | వస్తువుల స్వాధీనం..

Mendora Police | అసలేం జరిగిందంటే..?

పోలీసుల కథనం ప్రకారం.. పోచంపాడ్ గ్రామానికి (Pochampad Village) చెందిన వేముల నర్సింలుకు, దండుగుల రిషిక్‌కు మధ్య గత కొంతకాలంగా డబ్బుల వ్యవహారం, ఇతర వ్యక్తిగత కారణాలతో విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 6న రాత్రి 8 గంటల సమయంలో వీరి మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన వేముల నర్సింలు, తన కుమారులు ఉదయ్, కిషోర్‌తో పాటు కోట అరవింద్, అలకుంట చందులతో కలిసి రిషిక్‌పై కట్టెలు, కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నర్సింలు కత్తితో రిషిక్ కడుపులో బలంగా పొడవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ 7న తెల్లవారుజామున రిషిక్ మృతి చెందాడు.

Mendora Police | దర్యాప్తు నిందితుల అరెస్ట్

ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మెండోరా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. నిన్న వేముల నర్సింలు, ఉదయ్ కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు పరారీలో ఉన్న కోట అరవింద్, అలకుంట చందులను కూడా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

Mendora Police | వస్తువుల స్వాధీనం..

నిందితుల సమాచారం మేరకు హత్యకు ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి (CI John Reddy) తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Rural Development Officer | జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న

Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయాలి
RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం
Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి
Yellareddy Industrial Development | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మదన్​ మోహన్​
TAGGED:CI John Reddycrime news indialocal crime reportMendora MandalMendora Policemurder arrestNizamabad CrimePochampad incidentPochampad VillagePolice investigationTelangana newsyouth murder case
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mukul Chaudhary Innings Mukul Chaudhary Innings | ఐపీఎల్‌లో కొత్త సంచలనం ముకుల్ చౌదరి.. అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోకు విజయం, అభినందించిన‌ సంజీవ్ గోయెంకా
Next Article Kakatiya Medical College  Kakatiya Medical College | కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌.. ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?