Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు

బిజినెస్​తాజా వార్తలు

Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు

దేశీయ మార్కెట్‌లో మెర్సిడెస్ -బెంజ్ వి క్లాస్ లగ్జరీ ఎంపీవీ కారు రీఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ. 1.40 కోట్ల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 12:04 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Mercedes V-Class India
Mercedes V-Class India

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mercedes V-Class India | మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ మార్కెట్‌ (India Domestic Market) లో వి -క్లాస్ లగ్జరీ ఎంపీవీని తిరిగి ప్రవేశపెట్టింది. నాలుగేళ్ల తర్వాత మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ మోడల్.. ప్రీమియం లగ్జరీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎలఎమ్‌లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.

Contents
  • Mercedes V-Class India | ఎక్స్‌టర్నల్ డిజైన్..
    • Mercedes V-Class India | ఇంటీరియర్..
      • Mercedes V-Class India | ఇంజిన్ ఆప్షన్లు..

ఇది మేక్ ఇన్ ఇండియా (Make in India).. దేశీయంగా ఉత్పత్తి చేసిన ఈ వి -క్లాస్ ఎక్స్‌ట్రా లాంగ్ వీల్‌బేస్ (ఎల్‌డబ్ల్యూబీ)ను కలిగి ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో మరో 11 కొత్త మోడళ్లను విడుదల చేయాలనుకుంటున్నట్లు మెర్సిడెస్ -బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ (CEO Santosh Iyer) తెలిపారు. ఈ మోడల్ ప్రత్యేకతలిలా ఉన్నాయి.

Mercedes V-Class India | ఎక్స్‌టర్నల్ డిజైన్..

  • 2023లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లోకి వచ్చిన కొత్త వి -క్లాస్ ఇప్పుడు అనేక డిజైన్ అప్‌డేట్‌లతో భారత మార్కెట్‌ల్లోకి మళ్లీ అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ సిగ్నేచర్ గ్రిల్, పాత మోడళ్ల మాదిరిగా స్టైలింగ్ ఆప్షన్లతో వస్తోంది. ఈ బ్రాండ్ సిగ్నేచర్ గ్రిల్, పాత మోడళ్లలో స్టైలింగ్ లుక్‌తో ఉంది.
  • భారత మార్కెట్‌లో లాంగ్ 3,430 ఎంఎం వీల్‌బేస్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. మిగతా మోడళ్లలో కన్నా ఈ మెర్సిడెస్ కారు చాలా పొడవుంటుంది.
  • స్టార్ స్టడెడ్ గ్రిల్, స్పోర్టీ బంపర్, డీఆరఎల్ మల్టీ బీమ్ ఎలఈడీ హెడ్‌లైట్లున్నాయి.
  • ఎంపీవీ డ్యూయల్ టోన్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.

Mercedes V-Class India | ఇంటీరియర్..

Mercedes V-Class India
Mercedes V-Class India
  • కొనుగోలుదారులు 4, 6 సీట్ల లేఅవుట్‌లను ఎంచుకోవచ్చు. వెనక సీటు చాలా కంపర్ట్‌గా ఉంటుంది. లాంజ్ సీట్లను పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
  • 6 సీట్ల కాన్ఫిగరేషన్‌లో మూడో వరుసలో వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇతర ఫీచర్లలో 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, బర్మెస్టర్ ఆడియో సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, రెండు 12.3 అంగుళాల డాష్‌బోర్డ్ స్క్రీన్‌లు, 2 ఇంటీరియర్ థీమ్‌లున్నాయి.
  • సేఫ్టీ ఫీచర్లలో భాగంగా 7 ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ సూట్ కూడా ఉన్నాయి.

Mercedes V-Class India | ఇంజిన్ ఆప్షన్లు..

  • మెర్సిడెస్ బెంజ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
  • ‘ప్రైవేట్ సూట్ ఆన్ వీల్స’గా తీసుకొచ్చిన వి -క్లాస్ డీజిల్ వి300డి, పెట్రోల్ వి300 వేరియంట్లున్నాయి.
  • డీజిల్ వెర్షన్ 2 లీటర్, 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో 237 హెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది.
  • పెట్రోల్ వేరియంట్ 231 హెచ్‌పీని ఉత్పత్తి చేసే 2 లీటర్ ఇంజిన్ కూడా ఉంది. మైల్డ్ హైబ్రిడ్ అసిస్టెన్స్ ఉంది. ఈ రెండు ఇంజన్లు 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రన్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్

Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!
Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
TAGGED:CEO Santosh Iyerlexus lm competitorluxury cars indialuxury mpv indiaMake in Indiamercedes benz indiamercedes v class indiamercedes v class price
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Rajyadhikara Party | Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
Next Article Ramky Ramky | దిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాజెక్టును దక్కించుకున్న రామ్‌కీ ఇన్‌ఫ్రా
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?