అక్షరటుడే, వెబ్డెస్క్: Midday Meal Fish | విద్యార్థులకు మంత్రి వాకిటి శ్రీహరి గుడ్ న్యూస్ చెప్పారు. మధ్యాహ్న భోజనంలో చేపల కూర అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో ఆయన ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల (Government School)ల్లో ప్రస్తుతం మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. ఏ రోజు ఏ కూర వండాలో ప్రభుత్వం మెనూ సిద్దం చేసింది. అయితే చాలా బడుల్లో మెనూ అమలు కావడంలో లేదు. స్థానికంగా అందుబాటులో ఉండే కూరగాయలతో మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు వారానికి రెండు సార్లు గుడ్డు పెడుతున్నారు. అయితే మధ్యాహ్న భోజనంలో ప్రస్తుతం మాంసాహారం అందించడం లేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srharii) మాట్లాడుతూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు తెలిపారు. కాగా ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం ప్రకటించారు.
Midday Meal Fish | సాధ్యమేనా..
రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతి యేటా చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతోంది. ఈ క్రమంలో చేపల ఉత్పత్తి సైతం భారీగానే ఉంది. దీంతో మధ్యాహ్న భోజనంలో చేపలు పెడతామని ప్రకటించారు. అయితే పాఠశాలలో చేపల కూర పెట్టడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చేపలు వండటం చాలా శ్రమతో కూడిన పని. కొన్ని పాఠశాలల్లో 500కు పైగా విద్యార్థులు ఉంటారు. అలాంటి చోట చేపల కూర వండటం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) మాట్లాడుతూ.. మైనార్టీల విద్యకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు
ఇది కూడా చదవండి..: Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు

