Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!

అంతర్జాతీయంతాజా వార్తలు

Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కేవలం యుద్ధానికే పరిమితం కాకుండా.. ప్రపంచ ఎనర్జీ భద్రత, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. పరిస్థితులు మరింత విషమిస్తే.. గ్లోబల్ ఎనర్జీ సంక్షోభ ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 20, 2026 11:19 సా.
Naresh chandan
6 రోజులు ago
Share
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Middle East Oil Loss | మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల రిఫైనరీలు, ఆయిల్ ట్యాంకర్లు, సముద్ర మార్గాల్లో నౌకలపై జరిగిన దాడులతో భారీ స్థాయిలో చమురు నష్టం సంభవించినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ఎనర్జీ భద్రతపై ఆందోళనలను మరింతగా పెంచుతున్నాయి.

Contents
  • Middle East Oil Loss | భారీ మొత్తంలో చమురు ధ్వంసం..
    • Middle East Oil Loss | ఆర్థిక నష్టం..
      • Middle East Oil Loss | కాలిపోయిన ఆయిల్‌తో..
      • ఎల్‌పీజీ నష్టం
      • సముద్ర రవాణా ప్రభావం

Middle East Oil Loss | భారీ మొత్తంలో చమురు ధ్వంసం..

పలు నివేదికల ప్రకారం.. గల్ఫ్ ప్రాంతంలో జరిగిన పలు దాడుల వల్ల పెద్ద మొత్తంలో బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ధ్వంసమైనట్లు అంచనా. ముఖ్యంగా సముద్రంలో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడులతో భారీ ఎత్తున చమురు సముద్రంలో కలిసిపోయింది. కొన్నిచోట్ల రిఫైనరీలపై దాడులతో నిల్వ ఆయిల్ కూడా కాలిపోయింది.

  • ధ్వంసమైన క్రూడ్ ఆయిల్ (సుమారు) : 4 – 7 మిలియన్ బ్యారెళ్లు
  • సముద్రంలో కలిసిపోయిన చమురు మొత్తం :  రెండు మిలియన్ బ్యారెళ్లకు పైగా
  • రిఫైనరీలలో అగ్నికి ఆహుతి అయిన నిల్వ : 2 మిలియన్ బ్యారెళ్లు
  • ట్యాంకర్ పేలుళ్లలో కాలిపోయిన చమురు: 1 – 2 మిలియన్ బ్యారెళ్లు

Middle East Oil Loss | ఆర్థిక నష్టం..

ఇప్పటి వరకు జరిగిన దాడుల వల్ల బిలియన్ల డాలర్ల నష్టం సంభవించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ లో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల వరకు చమురు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పలు కలిపి ధ్వంసం అయిన ఘటనలు చూస్తే, జరిగిన నష్టం ప్రపంచ మార్కెట్లను కుదిపేసే స్థాయిలో ఉంది. రవాణా, ఇన్సూరెన్స్, నిల్వ ఖర్చులు సైతం పెరగడంతో ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

  • ఒక్క బ్యారెల్ సగటు ధర: $90
  • ఈ లెక్కన చమురు నష్టం విలువ: $ 320 – 630 మిలియన్ (₹2,600 – 5,200 కోట్లు)
  • ట్యాంకర్లు, రిఫైనరీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టం: $ 1.5  – 3 బిలియన్
  • మొత్తం నష్టం (అంచనా ): $ 2 – 3.5 బిలియన్ (₹ 16,000 – 29,000 కోట్లు)

Middle East Oil Loss | కాలిపోయిన ఆయిల్‌తో..

1 బ్యారెల్ లో 159 లీటర్ల ఇంధనం ఉంటుంది. ఈ లెక్కన యుద్ధంలో ధ్వంసం అయిన 5 మిలియన్ బ్యారెళ్లు అంటే..  795 మిలియన్ లీటర్లు కాలిపోయింది. దీనిని 10 లక్షల కార్లకు 6–8 నెలల పాటు ఇంధనం అందించవచ్చు. లేదా ఒక చిన్న దేశానికి 2–3 వారాల పాటు ఇంధన అవసరం తీర్చవచ్చు. లేదంటే.. లక్షల ఇళ్లకు కొన్ని వారాలు సరిపడే విద్యుత్తును అందించవచ్చు.

ఎల్‌పీజీ నష్టం

  • గ్యాస్ / ఎల్‌పీజీ ఉత్పత్తి అంతరాయం: 5% – 8% సరఫరా తగ్గుదల.
  • LNG టర్మినల్స్ ప్రభావం: 1–2 ప్రధాన కేంద్రాలు తాత్కాలికంగా నిలిచినట్లు నివేదికలను చూస్తే తెలుస్తోంది.

సముద్ర రవాణా ప్రభావం

ప్రపంచ చమురు సరఫరాలో హోర్ముజ్ జలసంధి ద్వారానే 20% జరుగుతోంది. దాడుల నేపథ్యంలో షిప్పింగ్ ఇన్సూరెన్స్ 30% – 50% పెరిగింది. దీనికితోడు కొన్ని నౌకల మార్గం మార్చడం వల్ల సరఫరా మరింత ఆలస్యం అవుతోంది.

ఇది కూడా చదవండి..: Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ

Ugadi Pachadi | షడ్​ రుచులు.. ఆరు భావాలు.. ఉగాది పచ్చడి మన జీవితానికి ఇచ్చే సందేశం ఇదే!
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం!
TAGGED:energy crisisgeopoliticsglobal energyIran Israel conflictMiddle East Crisisoil lossoil priceswar impact
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Budget Criticism | Telangana Budget Criticism | అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ : ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article March 21 Horoscope | పాత పెట్టుబడుల ద్వారా లాభాల వర్షం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఇక డోకా లేదు! March 21 Horoscope | పాత పెట్టుబడుల ద్వారా లాభాల వర్షం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఇక డోకా లేదు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?