Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Middle East war impact | పశ్చిమాసియా యుద్ధం.. కండోమ్​ల తయారీపై ఎఫెక్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Middle East war impact | పశ్చిమాసియా యుద్ధం.. కండోమ్​ల తయారీపై ఎఫెక్ట్​

అంతర్జాతీయం

Middle East war impact | పశ్చిమాసియా యుద్ధం.. కండోమ్​ల తయారీపై ఎఫెక్ట్​

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కండోమ్​ల తయారీపై పడింది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉందని తయారీదారులు పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 12:06 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Middle East war impact

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Middle East war impact | పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనేక రంగాలపై పడింది. ఇప్పటికే గ్యాస్ (Gas)​, ఇంధన కొరతతో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా కండోమ్​ల తయారీపై సైతం దీని ఎఫెక్ట్​ పడింది.

Contents
  • Middle East war impact | ధరలు పెరిగే అవకాశం
    • Middle East war impact | దిగుమతులపై ఆధారం

ఇరాన్​ (Iran), అమెరికా- ఇజ్రాయెల్​ మధ్య నెల రోజులుగా యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్​ హర్ముజ్​ జలసంధిని మూసి వేయడంతో పాటు గల్ఫ్​ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముడి చమురు, గ్యాస్​ సరఫరాలో అంతరాయం నెలకొంది. ఇప్పటికే అనేక దేశాలు ఇంధన, గ్యాస్​ ధరలు పెంచాయి. అయితే సరఫరా కొరతతో అమ్మోనియా (Ammonia), సిలికాన్ (Silicon) ఆయిల్ వంటి కీలక ముడిసరుకుల ధరలు పెరగడంతో, ఉత్పత్తి, ఆర్డర్ల అమలు దెబ్బతింటున్నాయని కండోమ్ తయారీదారులు అంటున్నారు.

Middle East war impact | ధరలు పెరిగే అవకాశం

హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్, క్యూపిడ్ లిమిటెడ్ సంస్థలు సిలికాన్ ఆయిల్ (పాలిడైమిథైల్‌సిలోక్సేన్ పిడిఎంఎస్) లభ్యత లేకపోవడం, అమ్మోనియా ధరల పెరుగుదలతో సతమతమవుతున్నాయి. లేటెక్స్‌ను స్థిరీకరించడానికి, అదనపు ప్రోటీన్‌లను తొలగించడానికి అమ్మోనియాను ఉపయోగిస్తారు, అయితే సిలికాన్ ఆయిల్ కోటింగ్ కందెనగా పనిచేస్తుంది. దేశంలోని ఒక ప్రముఖ కండోమ్ తయారీ సంస్థకు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ ముడిసరుకుల సరఫరా పరిమితులు, ధరల అస్థిరత కారణంగా కండోమ్​ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.

Middle East war impact | దిగుమతులపై ఆధారం

భారతదేశపు 1.7 బిలియన్ డాలర్ల గర్భనిరోధక మార్కెట్, తన అనహైడ్రస్ అమ్మోనియాలో సుమారు 86 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం అమ్మోనియా ధరలు సుమారు 40–50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే సిలికాన్ ఆయిల్ ధరలో విపరీతమైన పెరుగుదల మార్కెట్‌లో అనిశ్చితికి కారణమవుతోంది నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ధరల పెరుగుదల, సరఫరా కొరత నెలకొనే అవకాశం ఉందన్నారు.

దీనిని కూడా చదవండి : Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!

HMPV Virus | అమెరికాపై మరో ప్రమాదకర వైరస్​ పంజా.. వేగంగా విస్తరిస్తున్న HMPV!
Lahore US Consulate Attack | లాహోర్​లోని యూఎస్​ కాన్సులేట్ పై దాడి
US War on Iran | మిడిల్ ఈస్ట్ యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా
BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
TAGGED:ammonia price risecondom production crisismiddle east war impactraw material shortagesilicone oil shortage
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran attacks Iran attacks | కువైట్, దుబాయ్​పై ఇరాన్ దాడులు
Next Article Gandhari Bike Accident | Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?