అక్షరటుడే, వెబ్డెస్క్: Migrant Workers LPG | దేశంలోని వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఇచ్చే 5 కేజీల ఎఫ్‌టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ (Neeraj Mittal) రాష్ట్రాలకు లేఖ రాశారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు వలస కార్మికులుగా జీవిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్ కొరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి ఉచితంగా 5కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు (FTL Cylinders) సరఫరా చేస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు సిలిండర్లను కేటాయించింది. తాజాగా వాటి సరఫరాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే 5 కేజీల సిలిండర్ల రోజువారీ కేటాయింపును రెట్టింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Migrant Workers LPG | వలస కార్మికుల కోసం..
ఛోటు అని కూడా పిలువబడే 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ను, పట్టణ, పాక్షిక-పట్టణ ప్రాంతాల్లోని వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు. సాధారణ గృహ గ్యాస్ కనెక్షన్ల కోసం వినియోగదారులు తమ చిరునామా రుజువును సమర్పించాల్సి ఉంటుంది. ఇది వలస కార్మికులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వారు బ్లాక్ మార్కెట్ (Black Market) వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు వంటగ్యాస్ కొనేవారు. వారి కోసం కేంద్రం గతంలో ఎఫ్‌టీఎల్ సిలిండర్లను ప్రవేశ పెట్టింది. గుర్తింపు పత్రం చూపించడం ద్వారా ఈ 5 కేజీల సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఇది కూడా చదవండి..: Air India CEO Resignation | ఎయిరిండియా సీఈఓ రాజీనామా
