అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SI Suspension | వరంగల్ (Warangal) నగరంలోని మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ (SI Suresh)పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సీపీ (Warangal CP) సన్‌ప్రీత్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సై సురేశ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. భారీగా అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అంతేగాకుండా పలువురిని వేధించినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్‌లోని మహిళా సిబ్బందిపై సైతం వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల విచారణ జరిపారు.
SI Suspension | నిజమని తేలడంతో..
విచారణలో ఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్సై సురేశ్‌పై వేటు వేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. కాగా కొంతకాలంగా ఠాణా పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. కేసులో నమోదులో సదరు సబ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్వహరించినట్లు తెలిసింది. కొన్ని కేసుల్లో అధికార పార్టీ నేతలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : Fake ice cream | కల్తీ ఐస్‌క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్

