అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mission Bhagiratha Water Supply | మిషన్ భగీరథ(Mission Bhagiratha) నుంచి తాగునీటి సరఫరాను ఐదురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు (water supply halt) మిషన్ భగీరథ సబ్‌డివిజన్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు.
Mission Bhagiratha Water Supply | బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లో..
మిషన్ భగీరథ 145 ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం నుండి బాన్సువాడ (Banswada), జుక్కల్, బోధన్(Bodhan) నియోజకవర్గాల్లోని ఆవాసాలకు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని(Yellareddy water supply) ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ మండలాల్లోని ఆవాసాలకు మంచినీటిని(drinking water disruption) సరఫరా ఐదురోజుల పాటు ఉండదని అధికారులు తెలిపారు. ప్రధాన పైపులైన్లకు మరమ్మతులు, నిర్వహణ పనుల(local news Telangana) నిమిత్తం నీటి సరఫరాను నిలిపేస్తున్నామన్నారు. దీంట్లో భాగంగా 28వ తేదీనుంచి (Telangana water news) వచ్చే నెల 2వ తేదీ వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కాబట్టి ఆయా గ్రామాల్లోని ప్రజలు.. జీపీ, ఇతరత్రా మంచినీటి వనరులను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు విన్నవించారు.
ఇది కూడా చదవండి: Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్
