Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

తెలంగాణతాజా వార్తలు

MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 1:03 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
MLA Disqualification Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Disqualification Case |  రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్​ను స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ కొట్టి వేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్​ఎస్​ హైకోర్టు (High Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పీకర్​తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది.

Contents
  • MLA Disqualification Case | ముగ్గురికి మినహాయింపు
    • MLA Disqualification Case | ఎందుకు మినహాయించారు

రాష్ట్రంలో కాంగ్రెస్​ (Congress) అధికారంలోకి రావడంతో పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. దీంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే (BRS MLA)లు వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరారు. విచారణ చేపట్టిన స్పీకర్​ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లను డిస్మిస్​ చేశారు. దానం నాగేందర్​ అనర్హత పిటిషన్​ను కొట్టి వేయడంపై ఇప్పటికే బీజేపీ (BJP) హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్​ఎస్​ సైతం ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై పిటిషన్​ వేయగా.. బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలను ఆదేశించింది. అనంతరం విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది.

MLA Disqualification Case | ముగ్గురికి మినహాయింపు

మొత్తం పది మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అందరిపై ఆ పార్టీ నేతలు అనర్హత పిటిషన్లు వేశారు. హైకోర్టులో మాత్రం ఏడుగురిపై పిటిషన్ వేయడం గమనార్హం. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావులపై బీఆర్​ఎస్​ నేతలు (BRS Leaders) పిటిషన్​ వేశారు. అయితే పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్​కుమార్​ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్​ ఘన్​పూర్​) పేర్లను మినహాయించింది. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

MLA Disqualification Case | ఎందుకు మినహాయించారు

పార్టీ మారిన వారి విషయంలో బీఆర్‌‌ఎస్​ పట్టు వదలకుండా పోరాడుతోంది. ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్​ విచారణ చేపట్టి.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నిర్ణయంపై మరోసారి బీఆర్​ఎస్​ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇందులో ముగ్గురి పేర్లను ఎందుకు మినహాయించారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి గతంలో కాంగ్రెస్​లో చేరారు. ఆయన ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపించారు. త్వరలో ఆయన సొంత గూటికి చేరనున్నట్లు సమాచారం. దీంతో ఆయన పేరును బీఆర్​ఎస్​ తొలగించినట్లు తెలుస్తోంది. అయితే మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్​కుమార్​ పేర్లను ఎందుకు తొలగించారో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్​

March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత
Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
TAGGED:BJPBRS leadersBRS MLACongressHigh CourtMLA disqualification caseSupreme Court
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Gains Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Next Article Jeevan Reddy Resignation Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: OBC Women Quota | ఓబీసీ కోటా అమలు చేయాలి : కవిత

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?