అక్షరటుడే, కామారెడ్డి: Mobile Phone Recovery | జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా గత 30 రోజుల్లో రూ.20.32 లక్షల విలువైన 123 ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ మంగళవారం అభినందించారు.
Mobile Phone Recovery | ప్రతినెలా వందకు పైగా ఫోన్లు..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతినెలా వందకు పైగా మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది రూ.40 లక్షలు విలువైన 250 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. పోర్టల్ మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో (Kamareddy District) మొత్తం 4,531 మొబైల్ ఫోన్లను గుర్తించి రూ.7.25కోట్ల విలువైన ఫోన్లు బాధితులకు అప్పగించామని పేర్కొన్నారు.
Mobile Phone Recovery | సైబర్ మోసాలు..
మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు (Cyber Frauds) జరుగుతున్నాయని, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఫోన్ మిస్సైతే ఆందోళన వద్దని, సీఈఐఆర్ పోర్టల్ (CEIR Portal)తో తిరిగి పొందవచ్చన్నారు. బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చని తెలిపారు. గత ఏడాదిలోనే సుమారు రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు.
ఇది కూడా చదవండి..: TRESA Insurance Support | రెవెన్యూ ఉద్యోగులకు ట్రెసా అండ.. రూ.75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

