అక్షరటుడే, వెబ్‌డెస్క్: Modi Congress Criticism | ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రయోజనాలను ఆ పార్టీ పణంగా పెడుతోందని మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్ వేదికగా శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని (PM Narendra Modi) మాట్లాడారు.
భారత్ సాధిస్తున్న వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలుబొమ్మగా మారుతోందని ప్రధాని ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజలపై ఆ ప్రభావం పడకుండా తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ పక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్.. దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
Modi Congress Criticism | మోదీని నిందించాలని..
దేశం ఇబ్బందుల్లో చిక్కుకోవాలని, తద్వారా మోదీని నిందించవచ్చని వారు ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని మెరుగుపరిచే పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 22,860 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘షిల్లాంగ్-సిల్చార్ కారిడార్’ (Shillong-Silchar Corridor)కు భూమిపూజ చేశారు. సిల్చార్‌లోని ఎన్‌హెచ్-306 పై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు భూమిపూజ చేశారు. కరీంగంజ్ జిల్లా (Karimganj District)లోని పత్తర్‌కండి వద్ద కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అస్సాంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, విపక్షాలు విమర్శలకే పరిమితమవుతున్నాయని మోదీ అన్నారు.
ఇది కూడా చదవండి..: KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్

