Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ

అంతర్జాతీయం

Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్​లో మాట్లాడారు. ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 7:05 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Modi Iran Call

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Iran Call | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్​లో మాట్లాడారు. ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ కాలం పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Contents
  • Modi Iran Call | రెండో సారి..
    • Modi Iran Call | నౌకలు వచ్చేనా..

ప్రధానమంత్రి మోదీ ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, షిప్పింగ్ మార్గాలు తెరిచి సురక్షితంగా ఉండేలా చూడటం ప్రాముఖ్యతను తెలిపారు.

Modi Iran Call | రెండో సారి..

భారత పౌరుల భద్రతకు ఇరాన్ అందిస్తున్న నిరంతర మద్దతును ప్రధాని ప్రశంసించారు. ఫిబ్రవరి 28న ప్రస్తుత సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి మోదీ, ఇరాన్ అధ్యక్షుడి మధ్య జరిగిన రెండవ టెలిఫోన్ సంభాషణ ఇది. మార్చి 12న పెజెష్కియాన్ ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి మోదీకి వివరించారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ప్రధాని మోదీ పలువురు ప్రపంచ నాయకులతో మాట్లాడారు. వీరిలో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా నేతలు ఉన్నారు.

iran president

Modi Iran Call | నౌకలు వచ్చేనా..

హార్ముజ్​ జలసంధిని ఇరాన్​ మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో అనేక భారత నౌకలు చిక్కుకుపోయాయి. ఇటీవల పలు భారతీయ నౌకలకు ఇరాన్​ అనుమతిచ్చింది. దీంతో ఎల్​పీజీ లోడ్​తో ఉన్న నౌకలు భారత్ చేరుకున్నాయి. మిగతా నౌకలు కూడా భారత్​ వచ్చేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడటం గమనార్హం. మరోవైపు ఇరాన్​ నుంచి చమురు కొనుగోలు ఆసియా దేశాలకు అమెరికా అనుమతిచ్చింది. గతంలో ఉన్న ఆంక్షలను తొలగించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Spoke with President Dr. Masoud Pezeshkian and conveyed Eid and Nowruz greetings. We expressed hope that this festive season brings peace, stability and prosperity to West Asia.

Condemned attacks on critical infrastructure in the region, which threaten regional stability and…

— Narendra Modi (@narendramodi) March 21, 2026

 

దీనిని కూడా చదవండి : Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి

Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. గల్ఫ్​ దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని
Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..
Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
TAGGED:Hormuz Strait CrisisIndia Iran relationsIran president callModi Iran callNarendra Modi Iran talksWest Asia tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article LPG cylinder supply LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
Next Article Hanuman Maha Mandala Puja | Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?