అక్షరటుడే, వెబ్డెస్క్: Modi TMC Attack | పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ప్రజల మద్దతు భారీగా పెరుగుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర భయాందోళనలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. పూర్వ బర్ధమాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో శనివారం ప్రసంగించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో చట్టం-శాంతి భద్రతలను బలోపేతం చేస్తామన్నారు. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Modi TMC Attack | అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను రాష్ట్రం నుంచి పూర్తిగా బహిష్కరిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా వారికి చోటు కల్పించిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అక్రమ వలసలను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు.
Modi Attacks TMC | అవినీతి, రాజకీయ హింసపై చర్యలు
బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఏర్పడిన వెంటనే రాష్ట్రంలోని అవినీతి, చట్ట-శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేస్తామని మోదీ ప్రకటించారు. టీఎంసీ గూండాలు, సిండికేట్ నాయకులు, అవినీతి పాలకులను చట్టం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. అంతేకాకుండా, రాజకీయ హింసపై స్వతంత్ర ఎంక్వైయిరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చేస్తామని వెల్లడించారు. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని చెప్పారు.
Modi TMC Attack | పథకాలు కొనసాగిస్తూ.. అవినీతి అంతం చేస్తాం..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలను బీజేపీ నిలిపివేయబోదని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే టీఎంసీ అవినీతి, లూటీని పూర్తిగా అంతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Modi Rahul Interaction | పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం.. మోదీ – రాహుల్ గాంధీ మాటామంతి
