Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modi Trump Call | ప్రధాని మోదీకి ట్రంప్​ ఫోన్​.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Modi Trump Call | ప్రధాని మోదీకి ట్రంప్​ ఫోన్​.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ

అంతర్జాతీయం

Modi Trump Call | ప్రధాని మోదీకి ట్రంప్​ ఫోన్​.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రధాని మోదీకి ఫోన్​ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 24, 2026 7:53 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Modi Trump Call

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Trump Call | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్​ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు.

ట్రంప్​ తనకు ఫోన్​ చేసినట్లు ప్రధాని మోదీ (PM Modi) సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. పశ్చిమ ఆసియాలోని పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించి, వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుందన్నారు. అలాగే ప్రపంచం మొత్తానికి అత్యంత అవసరమైన హర్ముజ్​ జలసంధి తెరిచి, సురక్షితంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

Modi Trump Call | ఉద్రిక్తతలను తగ్గించడం కోసం..

అమెరికా-ఇరాన్ (America -Iran) మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రపంచ నౌకా రవాణా మార్గాలను పరిరక్షించడంపై ఇద్దరు నేతలు దృష్టి సారించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఇరాన్​పై సైనిక దాడులకు ట్రంప్​ ఇటీవల 5 రోజుల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్​ సైతం చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ట్రంప్​ మోదీకి ఫోన్​ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇరాన్​ హార్ముజ్​ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్​  సంక్షోభం తలెత్తింది. దీంతో దీనిని తెరవాలని భారత్​ కోరుతోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలను కోరుతోంది. ఈ క్రమంలో ట్రంప్​, మోదీ ఫోన్​ (Modi Trump Call )లో చర్చలు జరపడం గమనార్హం.

Received a call from President Trump and had a useful exchange of views on the situation in West Asia. India supports de-escalation and restoration of peace at the earliest. Ensuring that the Strait of Hormuz remains open, secure and accessible is essential for the whole world.…

— Narendra Modi (@narendramodi) March 24, 2026

దీనిని కూడా చదవండి : Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి

Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Khamenei Death Claims | ఖమేనీ హతం.. ట్రంప్​, నెతన్యాహు ప్రకటన.. ధ్రువీకరించిన ఇరాన్​ మీడియా!
Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
US Fighter Jets Crash | కువైట్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానాలు
Trump Iran Peace Plan | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు ముగింపు దిశగా అడుగులు.. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు శాంతి ప్రణాళిక
TAGGED:Donald Trumpglobal politics newsindia us relationsIran conflictmodi trump callNarendra ModiWest Asia tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Godrej Godrej | వేసవి కోసం సరికొత్త స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించిన గోద్రెజ్.. 40 శాతం వృద్ధి లక్ష్యం..
Next Article Olympiad Education Benefits Olympiad Education Benefits | ఒలంపియాడ్‌ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?