Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు

జాతీయం

Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్లు దాటింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 1:42 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Modi YouTube Subscribers
Modi YouTube Subscribers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi YouTube Subscribers | రాజకీయాల్లోనే కాదు.. డిజిటల్ ప్రపంచంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆయనకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ చాలామంది అభిమానులున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన హవా కొనసాగుతోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్.. ఇలా ప్రతి వేదికలోనూ మోదీదే హవా నడుస్తోంది.

Contents
  • Modi YouTube Subscribers | ట్రంప్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ
    • Modi YouTube Subscribers | భారీగా ఫాలోవర్లు
      • Modi YouTube Subscribers | ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మోదీ ఫాలోవర్ల సంఖ్య

ఆయన ప్రపంచ దేశాధి నేతలందరినీ వెనక్కి నెట్టి సోషల్ మీడియా సామ్రాజ్యంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ (YouTube)లో మోదీ చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లు దాటింది. దీంతో ఈ వేదికపై ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న రాజకీయ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) 2007లో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన 33 వేలకు పైగా వీడియోలను షేర్ చేశారు.

Modi YouTube Subscribers | ట్రంప్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ

అంతర్జాతీయ స్థాయిలో ఇతర ప్రముఖులతో పోలిస్తే కూడా ప్రధాని మోదీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండో స్థానంలో(6.6 మిలియన్లు) ఉన్నప్పటికీ, ఆయనకు ఉన్న సబ్‌స్క్రైబర్‌లు మోదీ సంఖ్యలో సుమారు నాలుగో వంతు మాత్రమే. కాగా అగ్ర రాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కంటే ప్రధాని మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనూ ఇదే తీరు ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో పోలిస్తే మోదీ యూట్యూబ్ చానల్‌కు దాదాపు మూడింతలు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లున్నారు. మోదీ ఎక్స్ ఖాతాకు 106.3 మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్‌బుక్ ఖాతాకు 54 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Modi YouTube Subscribers | భారీగా ఫాలోవర్లు

సోషల్ మీడియా (Social Media) వేదికలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవడం మోదీ వ్యూహంలో భాగం. ఆయన ప్రసంగాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అంతర్జాతీయ పర్యటనల దృశ్యాలు, ప్రత్యేక సందేశాలు వంటి కంటెంట్‌ను నిరంతరం అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. దీంతో యూట్యూబ్ మాత్రమే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయనకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు.

Modi YouTube Subscribers

Modi YouTube Subscribers | ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మోదీ ఫాలోవర్ల సంఖ్య

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటిన విషయం తెలిసిందే. ఆయన 2014లో ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో అడుగుపెట్టారు. పుష్కర కాలంలోనే ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం గమనార్హం. రాబోయే రోజుల్లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మోదీకి ఫాలోయింగ్ ఎంతలా ఉందంటే ప్రపంచంలోని తదుపరి ఐదుగురు అగ్రనేతల ఫాలోవర్ల సంఖ్యను కలిపినా మోదీ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ

South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
TAGGED:Donald TrumpInstagramModi YouTube SubscribersPM Narendra ModiRahul GandhiSocial MediaYouTube
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article PV Sindhu Returns PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
Next Article Strait of Hormuz Closure Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?