అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mohan Bhagwat RSS | నిజామాబాద్ జిల్లా కందకుర్తి (Kandakuthi)లోని కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) మోహన్ భగవత్ శనివారం ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సందర్శకుల బుక్‌లో సందేశాన్ని రాశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ.. హెడ్గేవార్ (Hedgewar) జననం, మరణం నాగ్‌పూర్‌లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని చెప్పారు. దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని యోచించామన్నారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజు తెలిసిందన్నారు.
Mohan Bhagwat RSS | హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి..
గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్ భగవత్ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు భారత్‌ను పాలించారన్నారు. హిందువులు ఏకంగా లేకపోవడంతోనే ఇది జరిగిందన్నారు. భవిష్యత్‌లో సైతం హిందూ సమాజం జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని ఆయన భావించారని చెప్పారు. దీంతో హిందువుల్లో చైతన్యం కోసం ఆర్ఎస్ఎస్ను స్థాపించారని మోహన్ భగవత్ తెలిపారు.
Mohan Bhagwat RSS | ఇక్కడి నుంచే…
హిందూ సమాజాన్ని ఆదర్శంగా మార్చడానికి హెడ్గేవార్ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో ఎంతోమంది నడుస్తున్నారని చెప్పారు. హెడ్గేవర్‌కు కందకుర్తి నుంచి సేవా భావం, దేశ భక్తి వచ్చాయన్నారు. కందకుర్తిలోని మట్టిలో సైతం హెడ్గేవార్ స్ఫూర్తి ఉందన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో స్ఫూర్తి మందిరం ఏర్పాటు చేసుకున్నామని, భవిష్యత్‌లో ఆయన ఆశయ సాధనకు ముందుకు సాగాలని సూచించారు.
Mohan Bhagwat RSS | పట్టిష్టమైన పోలీసు భద్రత..
మోహన్ భగవత్ పర్యటన సందర్భంగా పోలీస్‌శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. కేంద్ర పారా మిలటరీ, రాష్ట్రస్థాయి బలగాలు, 6 క్యూఆర్టీ బృందాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీపీ సాయిచైతన్య ఏర్పాట్లను దగ్గరుంచి పర్యవేక్షించారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్, కందకుర్తి సర్పంచ్ గియాజుద్దీన్, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు.
Mohan Bhagwat RSS | సన్మానాలు
స్మృతి వనం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అందరిని సన్మానించారు. సహకరించిన దాతలు, నిర్మాణంలో సాయం చేసిన వారు, స్థపతి, డిజైన్ చేసిన వారు, నిర్మాణ పనులు చేపట్టిన మేస్త్రీలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సన్మానించారు.

ఇది కూడా చదవండి : Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్ టెక్నాలజీస్ కీలకపాత్ర..
