అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మొహసినా కిద్వాయ్ (94) కన్ను మూశారు. బుధవారం తెల్లవారుజామున నోయిడాలోని మెట్రో ఆసుపత్రి (Metro Hospital)లో ఆమె తుది శ్వాస విడిచారు.
మొహసినా కిద్వాయ్ కాంగ్రెస్ (Congress)లో సుదీర్ఘకాలం పని చేశారు. ఆమె వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆమె అల్లుడు రజీ ఉర్ రెహమాన్ కిద్వాయ్ తెలిపారు. నేడు సాయంత్రం నిజాముద్దీన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.
Mohsina Kidwai Death | ఇందిరా గాంధీ హయాంలో..
కిద్వాయ్ ఇందిరా గాంధీ (Indira Gandhi) , రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆమె కీలకమైన శాఖలను నిర్వహించారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. గతంలో కిద్వాయ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా సేవలందించారు. 1932లో ఆమె ఉత్తర ప్రదేశ్‌లో జన్మించారు. 1960లో తొలిసారి యూపీ శాసన మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం యూపీ మంత్రిగా పని చేశారు. 1982 నుంచి 1989 కేంద్ర మంత్రిగా పని చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా సైతం సేవలు అందించారు. మొహసినా కిద్వాయ్కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం
